Navneet Rana Controversy: గణేశ్ విగ్రహాన్ని బురద నీటిలో విసిరేసిన ఎంపీ నవనీత్ రాణా, నెటిజన్ల ఆగ్రహం

Navneet Rana Controversy: లోక్‌సభ ఎంపీ నవనీత్ రాణా, ఆమె భర్త మరోసారి వివాదాస్పదమవుతున్నారు. ఈసారి పవిత్రమైన గణపతి విగ్రహాన్ని నిమజ్జనం చేయకుండా విసిరేసినందుకు విమర్శల పాలవుతున్నారు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 11, 2022, 10:10 PM IST
Navneet Rana Controversy: గణేశ్ విగ్రహాన్ని బురద నీటిలో విసిరేసిన ఎంపీ నవనీత్ రాణా, నెటిజన్ల ఆగ్రహం

Navneet Rana Controversy: లోక్‌సభ ఎంపీ నవనీత్ రాణా, ఆమె భర్త మరోసారి వివాదాస్పదమవుతున్నారు. ఈసారి పవిత్రమైన గణపతి విగ్రహాన్ని నిమజ్జనం చేయకుండా విసిరేసినందుకు విమర్శల పాలవుతున్నారు.

మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ నవనీత్ రాణా, ఆమె భర్త రవి రాణా మరోసారి వార్తల్లో కెక్కారు. గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఈ ఇద్దరూ చేసిన పని వివాదానికి దారితీస్తోంది. పవిత్రమైన గణపతి నిమజ్జన కార్యక్రమాన్ని అభాసుపాలు చేశారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. గణపతి నిమజ్జనం సందర్భంగా..నిబంధనల ప్రకారం నెమ్మదిగా గణపతి విగ్రహాన్ని నీటిలో కలపాలి. కానీ ఎంపీ నవనీత్ రాణా, ఆమె భర్త రవి రాణాలు ఏ మాత్రం హిందూమత ఆచారాల్ని పట్టించుకోకుండా, అగౌరవంగా బురద నీటిలో గణపతి విగ్రహాన్ని విసిరేసిన వీడియో వైరల్ అవుతోంది. 

ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మండిపడుతున్నారు. చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందూత్వ కాంట్రాక్టర్ల పనులు ఇలానే ఉంటాయని కొంతమంది విమర్శిస్తే..మరి కొంతమంది ఇదేనా మీ హిందూ మతం అంటూ కామెంట్లు చేస్తున్నారు. హిందూ దేవుళ్లను కించపర్చినందుకు కేసు నమోదు చేయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. అదే పని మరొకరు చేసుంటే ఈపాటికి నవనీత్ రాణా, బీజేపీలు పెద్ద రాద్ధాంతం చేసుండేవని మండిపడుతున్నారు.

ఈ ఘటనకు సంబంధించి శివసేన నవనీత్ రాణాను టార్గెట్ చేసింది. శివసేన డిప్యూటీ నేత సుష్మ అంధారే నవనీత్ రాణాపై విమర్శలు గుప్పించారు. మతంపేరుతో నవనీత్ రాణా ప్రారంభించిన హింసను ఆపేయాలని నిలదీశారు. గణపతిని ఎలా నిమజ్జనం చేయాలో అసలామెకు తెలుసా అని ప్రశ్నించారు. 

Also read: Delhi Bus Scam: ఢిల్లీ సర్కార్‌కు మరో షాక్.. బస్సుల కొనుగోలు స్కామ్‌లో సీబీఐ దర్యాప్తుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News