Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో గంటకో ట్విస్ట్.. తమకు సంబంధం లేదన్న అధికార పార్టీ ఎంపీ

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం విచారణలో రోజుకు సంచలనం వెలుగు చూస్తోంది. హైదరాబాద్ లో సాగుతున్న ఈడీ సోదాల్లో కొత్త వ్యక్తలు, సంస్థల లింకులు తెరపైకి వస్తున్నాయి. హైదరాబాద్ లో ఈడీ అధికారులు మరింత స్పీడ్ పెంచారు, సోమవారం మరో పది ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు

Written by - Srisailam | Last Updated : Sep 19, 2022, 02:31 PM IST
  • ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు
  • ఐటీ, రియల్ సంస్థల్లో సోదాలు
  • తమకు సంబంధం లేదన్న ఎంపీ మాగుంట
Delhi Liquor Scam:  ఢిల్లీ లిక్కర్ స్కాంలో గంటకో ట్విస్ట్.. తమకు సంబంధం లేదన్న అధికార పార్టీ ఎంపీ

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం విచారణలో రోజుకు సంచలనం వెలుగు చూస్తోంది. హైదరాబాద్ లో సాగుతున్న ఈడీ సోదాల్లో కొత్త వ్యక్తలు, సంస్థల లింకులు తెరపైకి వస్తున్నాయి. హైదరాబాద్ లో ఈడీ అధికారులు మరింత స్పీడ్ పెంచారు, సోమవారం మరో పది ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా వచ్చిన ఈడీ అధికారులు.. హైదరాబాద్ లోని 3 ఐటీ కంపెనీలతోపాటు కరీంనగర్‌కు చెందిన బిల్డర్ల ఇళ్లలో సోదాలు జరుపుతున్నారు. రెండు రియల్‌ఎస్టేట్‌ కార్యాలయాల్లోనూ సోదాలు చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి ఇంతవరకు జరిగిన విచారణలో తమకు లభించిన ఆధారాల ఆధారంగా తాజా ఈడీ సోదాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

మద్యం కుంభకోణానికి సంబంధించి సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో ఏ14గా ఉన్న హైదరాబాద్ మద్యం వ్యాపారి రామచంద్రన్ పిళ్లైని ఆదివారం రాత్రి  ఈడీ అధికారులు తమ కార్యాలయంలో ప్రశ్నించారు. మద్యం టెండర్లు, ఆర్థిక లావాదేవీలతో పాటు ఢిల్లీ బీజేపీ ఎంపీ విడుదల చేసిన స్టింగ్ ఆపరేషన్ వీడియోపై రామచంద్రన్ ను ఈడి అధికారులు ప్రశ్నించారని తెలుస్తోంది. లిక్కర్ స్కాంకు సంబంధించి రెండున్నర కోట్ల రూపాయలను లంచంగా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు మద్యం వ్యాపారులు ఇచ్చారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నగదును ఢిల్లీ ఎక్సైజ్ అధికారులకు ఎందుకు ఇచ్చారు.. ఈ మనీ ఎక్కడి నుంచి తెచ్చారన్న దానిపై వివరాలు తీసుకున్నారని సమాచారం.

మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఏపీకి చెందిన ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డికి లింకులు ఉన్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ముడుపులు సమర్పించిన కంపెనీల్లో మాగుంట లిక్కర్ కంపెనీ పేరు కూడా ఉంది. లిక్కర్ స్కాంలో తమపై వస్తున్న ఆరోపణలపై తాజాగా స్పందించారు ఎంపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి. తమ సంస్థపై వస్తున్న లిక్కర్ ఆరోపణలు నిరాధారమైనవని అన్నారు. తమ కుటుంబం 70 ఏళ్ల నుంచి మద్యం వ్యాపారంలో ఉందని చెప్పారు మాగుంట. దేశంలోని 8 రాష్ట్రాలతో తమకు వ్యాపారం ఉందన్నారు. అయితే  ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో  తమ కుటుంబం లేదన్నారు శ్రీనివాస్ రెడ్డి. తమ కంపెనీకి చెందిన చెన్నై, ఢిల్లీ కార్యాలయాల్లో సోదాలు జరిగాయని చెప్పారు.ఎలాంటి అక్రమాలు జరిగినట్లు ఆధారాలు లభించలేదని ఈడి అధికారులు తేల్చారని తెలిపారు. తమకు ఇచ్చిన పంచనామా రిపోర్టులోనే అదే రాశారన్నారు. మొదటి నుంచి తమ కుటుంబం నీతి, నిజాయితీగా వ్యాపారం చేసిందని వెల్లడించారు. ఈడీ జరుపుతున్నది  వ్యాపారపరమైన  దాడులుగానే భావిస్తున్నామని చెప్పారు. ఇందులో రాజకీయం లేదని ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి వివరణ ఇచ్చారు.

Also read: MLA PA Attack: భర్తను వదిలేసి నాతో రా.. మహిళ గొంతు కోసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే పీఏ! 

Also read:  యువరాజ్ సింగ్ పెను విధ్వంసం.. 6 బంతుల్లో 6 సిక్సులు! 12 బంతుల్లో హాఫ్ సెంచరీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebok

Trending News