Syria Boat Accident: సిరియా తీరంలో ఘోరం..77 మంది వలసదారుల మృతి..!

Syria Boat Accident: పొట్ట కూటి కోసం వారంతా దేశం దాటాలని అనుకున్నారు. అధికారుల కంట పడుకుండా వెళ్లాలని భావించారు. ఐతే వారిని బోటు ప్రమాదం కదిలించింది. ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపుతోంది. 

Written by - Alla Swamy | Last Updated : Sep 24, 2022, 02:53 PM IST
  • సిరియా తీరంలో ఘోర ప్రమాదం
  • పడవ బోల్తా
  • మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం
Syria Boat Accident: సిరియా తీరంలో ఘోరం..77 మంది వలసదారుల మృతి..!

Syria Boat Accident: సిరియా తీరంలో బోటు ప్రమాదం జరిగింది.  77 మంది మృతి చెందారు. మృతులంతా వలసదారులుగా గుర్తించారు. బతుకు దెరువు కోసం అక్రమంగా వలస వెళ్లే క్రమంలో ప్రమాదం చోటు చేసుకుంది. లెబనాన్ నుంచి దాదాపు 150 మందితో బయలుదేరిన పడవ సిరియా తీరానికి సమీపన బోల్తా పడింది. గల్లంతు అయిన మరో 20 మందిని కాపాడారు. ప్రస్తుతం వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇందులో 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. 

ప్రమాద సమయంలో పడవలో 120 నుంచి 150 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో లెబనాన్, సిరియా, పాలస్తీనా వాసులు ఉన్నట్లు గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. పడవ ఐరోపా వైపు వెళ్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. లెబనాన్‌లో 1.5 మిలియన్ల మంది సిరియా శరణార్థులు ఉన్నట్లు ఇటీవల ఐక్యరాజ్య సమితి పేర్కొంది.

Also read:Prabhas Maruthi Movie: ప్రభాస్ -మారుతి సినిమాలో బాలీవుడ్ హీరో.. పెద్ద ప్లానే ఇది!

Also read:Munugode Bypoll: మునుగోడులో బీజేపీ దూకుడు.. టీఆర్ఎస్ బేజారు! మంత్రి జగదీశ్ రెడ్డికి కేసీఆర్ క్లాస్...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News