కుమారస్వామి కేబినెట్‌లో మాయ మంత్రి !

                           

Last Updated : Jun 6, 2018, 01:38 PM IST
కుమారస్వామి కేబినెట్‌లో మాయ మంత్రి !

కుమారస్వామి కేబినెట్‌లో ఓ మాయ మంత్రికి చోటు లభించనుంది. మాయ మంత్రి అంటే ఇక్కడ మాయవతి పార్టీ బీఎస్పీకి చెందిన మంత్రి అన్నమాట. వివరాల్లోకి వెళ్లినట్లయితే కర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్, బీఎస్పీ కలసి ఎన్నికల్లో పోటీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఓ బీఎస్పీ ఎమ్మెల్యే గెలుపొందారు. దీంతో  బీఎస్పీ ఎమ్మెల్యే మహేష్ కు క్యాబినెట్ బెర్త్ స్థానం కోసం మాయవతి చేసిన ప్రయత్నాలు ఫలించాయి. తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇప్పేలా మాయవతి కాంగ్రెస్, జేడీఎస్ లకు ఒప్పించగలిగారు. 

యూపీ బయట తొలిసారిగా బీఎస్పీ మంత్రి

బీఎస్పీకి చెందిన రాజ్యసభ సభ్యుడు ఎంపీ సతీష్ చంద్ర మిశ్రా మీడియాతో మాట్లాడుతూ యూపీ బయట తమ ఎమ్మెల్యే మంత్రి కావడం పార్టీ వర్గాలకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యాల అర్థం కర్నాటక  కేబినెట్ బెర్త్ అనేది స్పష్టమౌతుంది. ఇదే నిజమైతే ఉత్తరప్రదేశ్ బయట తొలిసారిగా బీఎస్పీ ఎమ్మెల్యే మంత్రి పదవిని అలంకరించనున్నారన్న మాట. కాగా తాజా వార్త విన్న బీఎస్పీల్లో వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. బీఎస్పీ పార్టీ భవిష్యత్తుల్లో మరిన్ని విజయాలు సాధిస్తుందని పార్టీ కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Trending News