December Graha Gocharam 2022: ప్రతి నెల నిర్ణీత సమయంలో గ్రహాల గోచారం ప్రభావం అన్ని రాశుల జీవితాలపై పడుతుంటుంది.
డిసెంబర్ 3వ తేదీన బుధ గ్రహం ధనస్సు రాశిలో ప్రవేశించాడు. ఇవాళ అంటే డిసెంబర్ 5న శుక్రగ్రహం కూడా ధనస్సు రాశిలో ప్రవేశించాడు. డిసెంబర్ 16న సూర్యుడు, డిసెంబర్ 28న బుధుడు మకర రాశిలో గోచారం చేయనున్నాయి. ఇక డిసెంబర్ 29వ తేదీన శుక్రుడు మకరరాశిలో, డిసెంబర్ 31న బుధుడు ధనస్సులో వక్రమార్గం చేయనున్నాయి. ఈ క్రమంలో ఏ రాశులపై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసుకుందాం.
సింహ రాశి ప్రతి నెలా కొన్ని గ్రహాల గోచారం ప్రభావం అన్ని రాశులపై శుభంగా లేదా అశుభంగా ఉంటుంది. సింహరాశి జాతకులకు డిసెంబర్ నెల అదృష్టాన్ని తిరగరాయనుంది. ఈ నెలలో పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. ఈ సమయంలో వ్యాపారులకు విశేషమైన లాభముంటుంది. ఈ సందర్భంగా కొత్త పనులు ప్రారంభించవచ్చు. ఒకేసారి ధనలాభం కలుగుతుంది.
మిధునరాశి జ్యోతిష్యశాస్త్రంలో డిసెంబర్ నెల మిధున రాశి జాతకులకు ఓ వరం లాంటిది. ఈ నెల కెరీర్లో విజయం లభిస్తుంది. మిదున రాశి వారికి కెరీర్‌పరంగా లాభముంటుంది. వ్యాపారులకు లాభాలు కలుగుతాయి. ఈ నెలలో నిలిచిపోయిన పనులు పూర్తి కానున్నాయి. ఆర్ధికంగా లాభాలు ఆర్జిస్తారు. కుటుంబసభ్యుల మధ్య ప్రేమానురాగాలుంటాయి.
మకర రాశి జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మకర రాశి జాతకులకు డిసెంబర్ నెల అత్యంత శుభప్రదంగా ఉంటుంది. ఈ నెలలో ఈ రాశి జాతకులకు పనిలో, వ్యాపారంలో ధనలాభముంటుంది. సిబ్బంది సహకారం లభిస్తుంది. ఉద్యోగం మారే ఆలోచన ఉంటే. ఈ నెలలో చాలా అవకాశాలు లభిస్తాయి. మొత్తంగా చూస్తే ఈ నెలంతా బాగుంటుంది.
కుంభరాశి కుంభరాశిలో డిసెంబర్ నెలలో జరగనున్న గ్రహ గోచారం శుభసూచకంగా ఉంటుంది. డిసెంబర్ నెలలో గ్రహాల స్థితి కారణంగా ఉద్యోగస్థులకు బాగుంటుంది. డబ్బులు పెట్టుబడి పెట్టేందుకు ఆలోచిస్తుంటే ఈ నెల అత్యంత అనువైంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. భూమి, ఇళ్లు, వాహనాలు కొనవచ్చు.