Investment Tips: కొత్త ఏడాదిలో మీ డబ్బును ఇలా పెట్టుబడి పెట్టండి.. ఆదాయం డబుల్ కావడం పక్కా..!

Investment Tips For Beginners: మీరు కొత్త సంవత్సరంలో పెట్టుబడి పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారా..? అయితే డబ్బు చాలా జాగ్రత్తగా పెట్టుబడి పెట్టాలి. సరైన చిట్కాలను ఉపయోగించి..  పెట్టుబడి పెడితే మీకు మంచి ఆదాయం వస్తుంది. 
 

  • Jan 08, 2023, 18:11 PM IST
1 /5

కొత్త సంవత్సరం ప్రారంభమైంది. ఈ సమయంలో మీరు ఎన్నో ప్లాన్లు వేసుకుని ఉంటారు. కొత్త సంవత్సరంలో మీ ఆర్థిక లక్ష్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. కొన్ని పెట్టుబడి చిట్కాలను పాటించి.. మీ డబ్బును అనేక రెట్లు పెంచుకోవచ్చు. 

2 /5

పోర్ట్‌ఫోలియోను రూపొందించండి: మార్కెట్ హెచ్చుతగ్గుల నుంచి మీ పెట్టుబడులను రక్షించడానికి డైవర్సిఫికేషన్ ముఖ్యం. మీ పెట్టుబడులు నిర్దిష్ట ఆస్తి తరగతిలో కేంద్రీకృతమై ఉంటే.. మీరు మీ మొత్తం పోర్ట్‌ఫోలియోను ప్రమాదంలో పడేస్తున్నారు. ఆ మార్కెట్ రంగం బేరిష్‌నెస్‌ను అనుభవిస్తే.. మీరు కూడా నష్టాలను చవిచూడవచ్చు. ఈ సందర్భంలో మీ పోర్ట్‌ఫోలియోలో వివిధ రంగాలలో పెట్టుబడిని చేర్చండి.  

3 /5

దీర్ఘకాలిక పెట్టుబడులు: బలమైన ఆర్థిక భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టడానికి అత్యంత విజయవంతమైన మార్గం మీ పొదుపు, పెట్టుబడులను దీర్ఘకాలికంగా ప్లాన్ చేసుకోవడం. మీ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ టాలరెన్స్‌ను పరిగణనలోకి తీసుకునే ప్రణాళికను రూపొందించండి.   

4 /5

రుణాన్ని తగ్గించండి: మీరు బ్యాంకుల నుంచి ఏదైనా రుణం తీసుకున్నా లేదా తీసుకోవాలని అనుకుంటున్నా... ఈ ఏడాది తగ్గించండి లేదా పూర్తి చేయండి. రుణాల కారణంగా మధ్యతరగతి కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. సమర్థవంతమైన ఆర్థిక ప్రణాళిక కోసం లోన్ల భారాన్ని తగ్గించుకోవడం ఎల్లప్పుడూ మంచిది.  

5 /5

బడ్జెట్‌ను రూపొందించండి: మీరు ఎంత మొత్తంలో పెట్టుబడి పెట్టాలి..? మీ ఖర్చులు ఎంత..? అని బడ్జెట్‌ను రూపొందించండి. ఈ బడ్జెట్ ప్రకారం మాత్రమే డబ్బు పెట్టుబడి పెట్టండి.