Dream Astrology: స్వప్నశాస్త్రంలో చాలా రకాల కలల గురించి వివరణ, అర్ధముంది. కొన్ని కలలు శుభసూచకం. చాలామంది నిద్రలో చూసే కలలతో భయపడిపోతుంటారు. కానీ వాస్తవానికి కలలనేవి ఆ మనిషి ధనవంతుడౌతాయనే సంకేతాలిస్తుంటాయి. సాధారణంగా చెడు కలకు శుభ సంకేతాలు. ఏదైనా గుడ్ న్యూస్ వినడం, పెండింగులో పనులు పూర్తవడం వంటి మంచి పరిణామాలు చోటుచేసుకోవచ్చు.
కలలో పాముని చూడటం జ్యోతిష్యం ప్రకారం కలలో ఒకవేళ పాము కన్పిస్తే..అది కూడా శుభసూచకం. దీనర్ధం జీవితంలో ఏదైనా కొత్త పని ప్రారంభిస్తారని అర్ధం. ప్రత్యేకించి పాము మీకు చేరువలో కన్పిస్తే శుభం జరుగుతుందని అర్ధం.
కలలో పూజించడం కన్పిస్తే స్వప్నశాస్త్రం ప్రకారం ప్రతి కలకు అర్ధం పరమార్ధం ఉంటాయి. శుభ, అశుభ పరిణామాలుంటాయి. కొన్ని కలలు వ్యక్తి జీవితం మారుతుందనేందుకు సంకేతాలు. ఎవరైనా కలలో ఒక వ్యక్తి పూజలు చేస్తుండటాన్ని చూస్తే..శుభసూచకం. ఆ వ్యక్తి త్వరలో ధనవంతుడౌతాడని అర్ధం.
కలలో సింహం కన్పించడం స్వప్నశాస్త్రం ప్రకారం కలలో సింహం చూడటం శుభసూచకంగా భావిస్తారు. ఒకవేళ ఎవరైనా కలలో సింహాన్ని చూస్తే దీనర్ధం త్వరలోనే అతడి ఆగిపోయిన పనులు పూర్తవుతాయని అర్ధం. కోర్టు వివాదాలుంటే పరిష్కారమౌతాయి. త్వరలోనే విజయం లభిస్తుంది.
కలలో దేవుడిని చూడటం జ్యోతిష్యం ప్రకారం కలలో దేవుడిని చూడటం కూడా శుభసూచకమే. దీనివల్ల జీవితంలో సుఖ సంతోషాలు, శాంతి, సమృద్ధి లభిస్తాయి. సాక్షాత్తూ దేవుడి దర్శనం అయిందంటే..చాలా రకాల కష్టాల్నించి ఉపశమనం లభిస్తుందని అర్ధం.
కలలో మృతదేహాలు కన్పించడం చాలామంది కలలో మరణాలు చూస్తుంటారు. ఇవి చూసి భయపడిపోతుంటారు. కలలో కన్పించింది నిజమౌతుందేమోనని. కానీ స్వప్నశాస్త్రం ప్రకారం కలలో మృత్యువు చూడటం శుభసూచకం. ఈ కలకు అర్ధం త్వరలోనే మీ కోర్కెలు పూర్తవుతాయని అర్ధం. జీవితంలో కొత్త అవకాశాలు లభిస్తాయని అర్ధం.