Rs @30 10 Kg Rice And 5Kg Wheat Flour: భవిష్యత్తులో సరుకుల ధరలు విపరీతంగా పెరగబోతున్నాయి. దీని కారణంగా సామాన్యులపై ఊహించని భారం పడబోతోంది. ఇప్పటికీ చాలా మధ్యతరగతి కుటుంబాలు సరైన సరుకులు కొనలేక కొన్నింటితోనే కాలం గడిపేస్తున్నారు. మరి కొంతమంది అయితే కటిక పేదరికంలో ఖాళీ కడుపుతో రోజులు గడిపేస్తున్నారు. అయితే దీనిని కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ బ్రాండ్ పేరుతో మధ్యతరగతి పేదరికంలో బతుకుతున్న ప్రతి ఒక్కరికి అతి తక్కువ ధరలోనే నాణ్యమైన బియ్యంతో పాటు గోధుమలను అందించబోతోంది.
భారత్ బ్రాండ్ పేరుతో ఇప్పటికే కొన్నిచోట్ల నాణ్యమైన గోధుమల పిండి, బియ్యం విక్రయాలు కూడా కేంద్ర ప్రభుత్వం జరిపింది. అయితే మొదటి దశలో కొన్నిచోట్లకే పరిమితమైన ఈ విక్రయాలు.. త్వరలోనే రెండో విడత భారతదేశ వ్యాప్తంగా లభించబోతున్నాయి. దీని ద్వారా కేవలం రూ.34కే బియ్యంతో పాటు రూ.30కే గోధుమపిండి లభించబోతోంది.
అయితే కేంద్ర ప్రభుత్వం ఈ విక్రయాలను నవంబర్ 5వ తేదీ నుంచి కొన్నిచోట్ల ప్రారంభించగా.. మరికొన్ని చోట్ల మాత్రం అతిత్వరలోనే ప్రారంభించబోతున్నట్లు ప్రకటించింది. అయితే ఈ విక్రయాలు కేవలం కేంద్ర ప్రభుత్వం సూచించిన లొకేషన్స్ లోనే జరుగుతాయి. మీరు కూడా వీటిని కొనుగోలు చేయాలనుకుంటున్నారా?
ఈ భారత్ బ్రాండ్ కు సంబంధించిన గోధుమపిండి, బియ్యం కొనుగోలు కేవలం కొన్నిచోట్లనే లభించనున్నాయి. అందులో ఈ కామర్ సంస్థలలో పాటు నాఫెడ్ కేంద్రాలు, ఎన్‌సీపీఎఫ్ వేదికల్లో అందుబాటులో ఉండబోతున్నట్లు కేంద్రం తెలిపింది.
పెరుగుతున్న వస్తువుల ధరలను దృష్టిలో పెట్టుకొని మధ్యతరగతి వారికి ఆ భారం నుంచి ఉపశమనం కలిగించేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రెండో విడతలు భాగంగా దాదాపు 3.9 లక్షలకు పైగా టన్నుల గోధుమ లను, రెండు లక్షలకు పైగా టన్నుల బియ్యాన్ని సేకరించి విక్రయించబోతున్నట్లు కేంద్రం తెలిపింది.
ఫేజ్ వన్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం గోధుమ పిండిని కేవలం రూ.27కే విక్రయించింది. బియ్యాన్ని మాత్రం రూ.29లకు అందుబాటులోకి తీసుకువచ్చింది. కానీ ఈసారి మాత్రం కాస్త తెరలను పెంచి విక్రయించినట్లు తెలుస్తోంది.
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపిన వివరాల ప్రకారం.. గోధుమపిండి ఐదు కేజీలు ప్యాకెట్లు ఉంటుందని, ఇక బియ్యం అయితే 10 కేజీల ప్యాకెట్లు ఉంటాయని తెలిపారు. వీటిని అతి తక్కువ ధరలో విక్రయించి సామాన్యునికి వారం తగ్గేలా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందన్నారు.