7Th Pay Commission: కేంద్రం నుంచి 545 డ్రైవర్‌ పోస్టులకు రిక్రూట్‌మెంట్.. జీతం 7వ వేతన సంఘం ప్రకారమే.. పూర్తి వివరాలు ఇవే!

ITBP Constable Driver Recruitment 2024 Salary: ITBP (ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్)-2024 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. కామన్ సెంట్రల్ సర్వీస్ గ్రూప్ సి కింద కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టులకు రిక్రూట్‌మెంట్ డ్రైవ్ జరుగుతోంది. ఇందులో 545 పోస్టులు నాన్-గెజిటెడ్ (నాన్ మినిస్టీరియల్ పోస్టులు) ఉన్నాయి. ఏడో వేతన సంఘం ప్రకారం రూ. 21,700 నుంచి రూ.69,100 జీతాలు ఉంటాయి.

1 /6

 ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకొనేవారు పదో తరగతి ఉత్తీర్ణత అయి ఉండాలి. హెవీ మోటార్ వెహికల్  డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. ఈ ప్రక్రియను ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.  నేటి (అక్టోబర్ 08) నుంచి ప్రారంభమైంది. 

2 /6

ఈ లింక్  recruitment.itbpolice.nic.in ద్వారా సర్టిఫికెట్స్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు నవంబర్ 06వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ, తేదీలు, దరఖాస్తు ఫీజులు,  పే స్కేల్ వంటి వివరాలను వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. 

3 /6

మొత్తం 525 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు ITBP అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. 

4 /6

ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థి వయస్సు 21 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. అధికారిక వెబ్‌సైట్ https://recruitment.itbpolice.nic.in/ ని సందర్శించి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

5 /6

.ఇందులో హోమ్‌పేజీకి వెళ్లి  ITBP రిక్రూట్‌మెంట్ 2024 లింక్‌పై క్లిక్ చేయండి. ఇందులో పోస్టుకు సంబంధించిన అవసరమైన వివరాలు ఉంటాయి. 

6 /6

 ఆ తరువాత దరఖాస్తు ఫారమ్‌ను పొందాల్సి ఉంటుంది. ఇందులో మీ వివరాలు నింపి, కావాల్సిన పత్రాలను ఇవాల్సి ఉంటుంది.