Lunar Eclipse 2024: రేపే హార్వెస్ట్ మూన్.. ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం!!

2024 Lunar Eclipse Effect On Zodiac Signs: ఈనెల మంగళవారం అనగా సెప్టెంబర్ 17 తేదీన చంద్రగ్రహనం ఏర్పడబోతుంది. అదే రోజున పౌర్ణమి కూడా. ఇలా చంద్రగ్రహణం ఏర్పడం ఈ సంవత్సరంలో రెండవది అలాగే చివరిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. రేపు రాత్రి హార్వెస్ట్ మూన్ గా చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. 
 

1 /13

జ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహణాలు మన జీవితాలపైన ఏంతో ప్రభావం చూపుతాయి. రేపు ఏర్పడబోయే చంద్రగ్రహణం కూడా అన్ని 12 రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. అయితే ప్రతి వ్యక్తి జాతకం ప్రకారం ఈ ప్రభావం మారుతూ ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. 

2 /13

మేషం రాశి:  మేష రాశి జాతకులకు ఇది ఏంతో అనుకూలమైన సమయం. చంద్రగ్రహణం ప్రభావం కారణంగా  ధనలాభాం అధికంగా కలుగుతాయి. కొత్త ప్రయత్నాలు సఫలం అవుతాయి. మనో బలమే మిమ్మల్ని నడిపిస్తుంది. అంతేకాకుండా మానసిక ప్రశాంతత లభిస్తుంది. 

3 /13

వృషభం రాశి: వృషభ రాశివారికి ఊహించన మార్పులు  చోటు చేసుకుంటాయి. ఆర్థికంగా నష్టాలు కలగవచ్చు కానీ సమయాన్ని డబ్బులు అందుతాయి. కుటుంబసభ్యులు, స్నేహితులతో కొంత సమయం గడపడం మంచిది. ఆర్థిక విషయాలపై కొంత జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.   

4 /13

మిథునం రాశి: ఈ రాశివారికి అన్ని పనుల్లో విజయం లభిస్తుంది. వృత్తి, జీవితంలో శుభవార్త వింటారు. కొత్త ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్నవారికి  మంచి ఫలితాలు కలుగుతాయి. కష్టానికి తగినంత ఫతితాలు పొందుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.   

5 /13

కర్కాటకం రాశి:  జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతుంది. మంచి అనుభవిలు ఎదురవుతాయి. ఏ పని అయినా విజయవంతంగా పూర్తి చేస్తారు. తెలివి తేటలతో అందరి ప్రశంసలు పొందుతారు. ఈ రాశివారు దూరప్రయాణాలు చేస్తారు.   

6 /13

సింహం రాశి: ఆర్థికంగా పుంజుకుంటారు. ఎప్పటినుంచో ఆగిపోయిన కొన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి. ప్రేమ జీవితం కూడా బాగుంటుంది. లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. ఆవేశంతో తీసుకునే నిర్ణయాలు కష్టాలు తీసుకువస్తాయి.  

7 /13

కన్య రాశి: కన్యరాశివారి జీవితంలో ఊహించని మార్పులు జరగవచ్చు. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. శాంతిగా ఉండటం చాలా అవసరం. ఆర్ధకంగా కొంత లాభాలు పొందుతారు. ఆవేశం పనికిరాదు.   

8 /13

తుల రాశి: ఈ రాశివారికి అనుకూలమైన సమయం. ఉద్యోగంలో వచ్చే పెద్ద ప్రాజెక్టులను సలువుగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేయకండి. జీవిత భాగస్వామితో కొంత సమయం గడపండి. ఇష్టదైవాఆర్థన చేయడం వల్ల  మంచి ఫలితాలు కలుగుతాయి.   

9 /13

వృశ్చికం రాశి: వృశ్చిక రాశివారు కొత్త ప్రేమ సంబంధం ప్రారంభం కావచ్చు. వృత్తి, ఉద్యోగాల్లో మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. కొత్త ఆలోచనలు, ప్రాజెక్టులు  దృష్టిని ఆకర్షిస్తాయి. కుటుంబంతో గడిపే సమయం మరింత ఆనందదాయకంగా ఉంటుంది.  

10 /13

ధనుస్సు రాశి: ధనస్సు రాశి వారు ఆర్థికంగా మరింత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. అధిక ఖర్చులు పెరుగుతాయి. ఏదైనా పని చేసే ముందు ఆచితూచి వ్యవహరించడం మంచిది. నవగ్రహ సూత్రాలు పటించడం వల్ల మంచి ఫలితాలు దక్కుతాయి.  

11 /13

మకరం రాశి: మనోబలంతో అనుకున్న పనులను సాధిస్తారు గృహ వాహన ధనయోగాలు ఉన్నాయి ఆర్థికంగా బలపడతారు. ఒత్తిడి నుంచి జైస్తారు సకాలంలో అనుకున్న పనులు నెరవేయ్ లక్ష్మీ దేవా స్తోత్రం  పట్టించడం మంచిది.  

12 /13

కుంభ రాశి: అనుకున్న పనులు వెంటనే పూర్తవుతాయి ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సమయం గడపడం మంచిది. కోపం ని తగ్గించుకుంటే మంచిది. వ్యాపారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇష్టదైవార్థనతో మంచి ఫలితాలను పొందుతారు. 

13 /13

మీనం రాశి:  మీనరాశివారికి అద్భుతమైన కాలం నడుస్తుంది. శ్రమకు తగినంత ఫలితం కలుగుతంది. ఆర్థికంగా మెరుగుపడుతారు. శత్రువులు ఉన్నారు జాగ్రత్త. అనుకున్న పనులు వెంటనే పూర్తి అవుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.  

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x