Royal Enfield Classic 350: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ 350 క్రేజీ లుక్స్‌.. చూస్తే మతిపోతది

2024 Royal Enfield Classic 350 Features And Price Here Full Details: బుల్లెట్‌ బండి అంటే ఒక్క యువతకే కాదు అందరికీ నచ్చే వాహనం. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఠీవీ వేరు. బుల్లెట్‌ బండిలో కొత్త మోడల్‌ రాబోతున్నది. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ 350 మోడల్‌కు సంబంధించిన లుక్స్‌ క్రేజ్‌ ఉన్నాయి. చూస్తే వావ్‌ అనకుండా ఉండరు. మరి ఆ బండి ఫీచర్లు, ధర ఏమిటో తెలుసుకోండి.

1 /6

2024 Royal Enfield Classic 350: క్రేజీ లుక్స్‌.. అద్భుతమైన ఫీచర్లతో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ నుంచి మరో మోడల్‌ దిగుతోంది. సెప్టెంబర్‌ 1వ తేదీన విడుదల కానున్న రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ 350 మోడల్‌కు సంబంధించిన ఫొటోలు చూసేయండి. చూసతే మతిపోతది.

2 /6

2024 Royal Enfield Classic 350: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ వాహనాల్లో ముఖ్యమైన అప్‌గ్రేడ్‌ మొత్తం ఎల్‌ఈడీ లైటింగ్ విధానం ఉంటుంది. హెడ్‌లైట్, పైలట్ లైట్లు, సూచికలు, టెయిల్‌లైట్ ఇలా అన్నీ కూడా ఈ మోడల్‌లో ఎల్‌ఈడీ ఉంటాయి. అదనంగా టైప్-సీ యూఎస్‌బీ ఛార్జర్, గేర్ పొజిషన్ ఇండికేటర్ వంటివి ఈ మోడల్‌లో వచ్చాయి.

3 /6

2024 Royal Enfield Classic 350: ఇది అనలాగ్ స్పీడోమీటర్, చిన్న ఎల్‌సీడీ స్క్రీన్‌తో సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిగి ఉంది. ఎల్‌సీడీ స్క్రీన్‌లో ఇంధన స్థాయి, ఓడోమీటర్ రీడింగ్‌, ట్రిప్ డేటా వంటి ముఖ్యమైన సమాచారం కనిపిస్తుంది. రైడర్లు ట్రిప్పర్ నావిగేషన్ పాడ్‌ని కూడా ఎంచుకోవచ్చు. టర్న్-బై-టర్న్ డైరెక్షన్‌లు, ఫోన్‌ కాల్ అలర్ట్‌లను అందిస్తాయి.

4 /6

2024 Royal Enfield Classic 350: ఈ వాహనం ఐదు విభిన్న రంగుల్లో అందుబాటులో ఉంది. ఐదు థీమ్‌లుగా విభజించారు: క్రోమ్‌, మాటే, హల్కీన్‌, సిగ్నల్స్‌, రెడ్డిచ్‌. రంగుల పాలెట్‌లో మద్రాస్ రెడ్, జోధ్‌పూర్ బ్లూ, ఎమరాల్డ్, మెడలియన్ బ్రౌన్, స్టెల్త్ (నలుపుపై ​​నలుపు), కమాండో రంగుల్లో ఉన్నాయి.

5 /6

2024 Royal Enfield Classic 350: ఇంజిన్ సెటప్ యథావిధిగా ఉంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడిన 349 సీసీ. సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో ఈ వాహనం వస్తోంది. ఈ సెటప్ 20బీహెచ్‌పీ శక్తిని, 27ఎన్‌ఎం టార్క్‌ను అందిస్తుంది. సస్పెన్షన్ సిస్టమ్ కూడా అలాగే ఉంటుంది. ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుకవైపు ట్విన్ గ్యాస్-ఛార్జ్డ్ షాక్ అబ్జార్బర్‌లు ఉన్నాయి.

6 /6

2024 Royal Enfield Classic 350: ఒకే ఫ్రంట్ డిస్క్, వెనుక డ్రమ్ బ్రేక్‌లు వస్తున్నాయి. అధిక ట్రిమ్‌లు వెనుక డిస్క్ బ్రేక్‌లు, డ్యూయల్-ఛానల్ ఏబీఎస్‌లను అందిస్తున్నారు. ఈ మోడల్ ధర రూ.1.93 లక్షల నుంచి రూ.2.2 లక్షల మధ్య ఉండవచ్చు. రంగు ఇతర ఫీచర్లను బట్టి ధరల్లో మార్పు ఉండవచ్చు.