2024 Business Idea: జాబ్‌ పోయిన వారికి అద్భుతమైన బిజినెస్‌ ఐడియా..నెలకు లక్ష రూపాయలు పొందే వ్యాపారం!

Aloe Vera Gel Business: ప్రస్తుత కాలంలో ఉద్యోగాలపై ఆధారపడటం కంటే సొంతంగా బిజినెస్‌ స్టార్ట్‌ చేయాడానికి మక్కువ చూపుతున్నారు. ఉద్యోగంలో జీతాలు పెరగకపోవడం కారణంగా మరికొంతమంది ఉద్యోగ భద్రత లేకపోవడం వంటి కారణాల వల్ల చిన్న వ్యాపారాలను ప్రారంభించడానికి ఇష్టపడుతున్నారు. ఇందులో వ్యాపారంలో మనమే బాస్‌లా వ్యవహరించే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో మన స్వంత ఆలోచనలను అమలు చేసుకోవచ్చు. అయితే మీరు కూడా ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్నారా..? అయితే ప్రతి సంవత్సరం రూ. 13 లక్షలు సంపాదించే ఈ బిజినెస్‌ ఐడియా మీకోసం. ఇంతకీ ఈ బిజినెస్‌ ఏంటి? ఎలా ప్రారంభించాలి అనే వివరాలు తెలుసుకుందాం. 
 

1 /7

ఉద్యోగం వదిలేసి, సొంత వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచన ఉంటే ఇప్పుడు మీరు తెలుసుకొనే బిజినెస్‌ ఎంతగానో సహాయపడుతుంది. ఇందులో మీరు ఎక్కువ పెట్టుబటి పెట్టాల్సిన అవసరం లేదు.   

2 /7

ఈ బిజినెస్‌ అలోవెరా జెల్‌ తయారీ చేయడం. అలోవెరాను తెలుగులో కలబంద అని కూడా పిలుస్తారు. మార్కెట్‌లో దీనికి ఎక్కువ డిమాండ్‌ ఉంది. 

3 /7

అలోవెరాను ఎక్కువగా ఫేస్‌ క్రీములకు, ప్రొడెక్ట్స్‌లకు ఉపయోగిస్తారు. ఇది ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు కలిగిన మొక్క. ఆయుర్వేద ఔషధాలలో కూడా ఉపయోగిస్తారు.

4 /7

కొత్తగా బిజినెస్‌ స్టార్ట్‌ చేయాలి అనుకొనేవారు ఈ కలబంద బిజినెస్‌ను ప్రారంభించవచ్చు. కొంత సమయంలోనే అధిక లాభాలను పొందవచ్చు. 

5 /7

ఈ బిజినెస్‌ స్టార్ట్‌ చేయడానికి కేవలం రూ. 2.50 లక్షలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. దీంతో మీరు సంవత్సరానికి రూ. 13 లక్షల వరకు సంపాదించుకోవచ్చు. మీ వద్ద పెట్టబడి పెట్టడానికి డబ్బు లేకపోతే ప్రధాన మంత్రి ముద్ర యోజనలో లోన్‌ తీసుకోవచ్చు. 

6 /7

అలోవెరా జెల్‌ తయారు చేసే యూనిట్‌  ఏర్పాటు కోసం రూ. 24.83 లక్షలు ఖర్చుచేయాల్సి ఉంటుంది. దీని కోసం మీకు బ్యాంక్‌లో టర్మ్‌లోన్‌ కూడా లభిస్తుంది.

7 /7

 ఈ బిజినెస్‌ను చిన్నగా కూడా ప్రారంభించవచ్చు. బిజినెస్ ప్రారంభించిన ఒక సంవత్సరంలో  రూ. 4 లక్షల వరకు లాభం పొందవచ్చు. గ్లోబల్ మార్కెట్‌లో కలబందకు ఎంతో డిమాండ్‌ ఉంది.