Best Interest Rates Banks: అధిక వడ్డీని అందించే బ్యాంకులు ఇవే

  • Aug 18, 2020, 15:07 PM IST

మీ చేతిలో ఉన్న డబ్బును ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసి చేతులు కాల్చుకున్నారా.. లేక బ్యాంకులలో డిపాజిట్ చేసి తక్కువ వడ్డీ పొందుతున్నారా.. అయితే మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఇన్వెస్ట్ చేసి మోసపోవడం కంటే బ్యాంకులలో సేవింగ్స్ చేయడం బెటర్. అయితే అధిక వడ్డీ అందించే బ్యాంకులలో డబ్బు దాచుకోవడం మంచి నిర్ణయం. ప్రతి బ్యాంకులో ఒకే రకమైన వడ్డీ రేట్లు ఉండవని తెలిసిందే. కొన్ని బ్యాంకులు సేవింగ్స్ ఖాతాలపై తక్కువ వడ్డీ అందిస్తే.. మరికొన్ని బ్యాంకుల్లో అధిక వడ్డీ లభిస్తుంది. 

1 /6

ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు తమ కస్టమర్లకు సేవింగ్స్ అకౌంట్లపై 6 నుంచి 7 శాతం వరకు వడ్డీ (IDFC First Bank Interest Rates) అందిస్తోంది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 500 రోజులవరకైతే 7శాతం వడ్డీ, సీనియర్ సిటిజన్లకైతే 7.50శాతం వడ్డీ వస్తుంది. కానీ మినిమం బ్యాలెన్స్ రూ.10,000 కలిగి ఉండాలి. Image: IDFC First Bank Twitter

2 /6

ఆర్‌బీఎల్ బ్యాంకు 4.75శాతం నుంచి 6.75శాతం వరకు సేవింగ్స్ ఖాతాలతో వడ్డీ ఇస్తుంది. మినిమమ్ బ్యాలెన్స్ రూ.500 నుంచి రూ.2,500 వరకు ఉంటుంది. ఈ బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అయితే రెండేళ్లవరకు డిపాజిట్లపై 7.20శాతం వడ్డీ, సీనియర్ సిటిజన్ల డిపాజిట్లపై 7.70శాతం వడ్డీ అందిస్తోంది.    Photo: Reuters

3 /6

బంధన్ బ్యాంకులో 4 నుంచి 7.15 శాతం వరకు వడ్డీ అందిస్తారు. అయితే మనిమమ్ బ్యాలెన్స్ రూ.5000 వరకు సేవింగ్స్ ఖాతాలో ఉండాలి.

4 /6

ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 4 నుంచి 7 శాతం వరకు వడ్డీ అందిస్తోంది. అయితే మినిమం బ్యాలెన్స్ రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు ఉంటుంది.

5 /6

ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 4 నుంచి 6.5 శాతం వరకు వడ్డీ అందిస్తోంది. ఇందులో మినిమం బ్యాలెన్స్ లాంటి నిబంధనలు లేవు.   Photo: ZeeBiz

6 /6

లక్ష్మీవిలాస్ బ్యాంక్ 3.25శాతం నుంచి 6 శాతం వరకు వడ్డీ అందిస్తోంది. అయితే మినిమం బ్యాలెన్స్ రూ.500 నుంచి రూ.1000 వరకు కలిగి ఉండాలి.   Photo: Youtube