7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు.. జీతాల పెంపునకు అప్పుడే గ్రీన్ సిగ్నల్..!

7th Pay Commission DA Hike 2024: ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు జీతాల పెంపు కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది రెండో డీఏ పెంపు ప్రకటన త్వరలోనే ఉండే అవకాశం ఉండగా.. తేదీపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఈ నెల రెండు లేదా మూడో వారంలో డీఏ పెంపు ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే డీఏ పెంపు నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా.. జూలై 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుంది. జీతాల పెంపుపై కేంద్రం ఇప్పటికే కసరత్తు చేస్తోంది.
 

1 /9

ఈసారి డీఏ 3 శాతం పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో మొత్తం డీఏ 53 శాతానికి చేరనుంది.  

2 /9

ఈ ఏడాది మొదటి డీఏ 4 శాతం పెరిగింది. అంతకుముందు 46 శాతం ఉండగా.. 50 శాతానికి చేరింది. ఇప్పుడు 3 శాతం పెంచితే.. 53 శాతం అవుతుంది.  

3 /9

అక్టోబర్ 5న హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అంతకుముందే ఈ నెల చివరి వారంలో డీఏ పెంపు ప్రకటన ఉంటుందని అంటున్నారు. ఒకేసారి మూడు నెలల బకాయిలు అందుకుంటారు. దీంతో భారీ మొత్తంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతుంది.   

4 /9

ప్రతి ఆరు నెలలకు ఒకసారి చొప్పున ఏడాదిలో రెండుసార్లు కేంద్రం జీతాలు పెంచుతున్న విషయం తెలిసిందే. డీఏ పెంపుతో ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ లబ్ధి చేకూరుతుంది.  

5 /9

గత నాలుగు త్రైమాసికాల్లోనూ డీఏ 4 శాతం పెరిగింది. AICPI ఇండెక్స్ డేటా ఆధారంగా కేంద్రం పెంచుతున్న విషయం తెలిసిందే.  

6 /9

జనవరి నుంచి జూన్ నెల వరకు వచ్చిన AICPI ఇండెక్స్ డేటా ప్రకారం 3 శాతం డీఏ పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.  

7 /9

మరోవైపు కొత్త పే కమిషన్ ప్రకటనపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉత్కంఠ నెలకొంది. 7వ వేతన సంఘం మరో ఏడాదిన్నరలో ముగుస్తున్న నేపథ్యంలో త్వరలోనే 8వ వేతన సంఘం ప్రకటన ఉంటుందని భావిస్తున్నారు.  

8 /9

కొత్త పే కమిషన్ ఇప్పుడు ఏర్పాటు చేస్తే.. దాని సిఫార్సులు జనవరి 1, 2026 నుంచి అమల్లోకి వస్తాయి. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో భారీ పెంపు ఉంటుంది.   

9 /9

గమనిక: ఇక్కడ అందజేసిన సమాచారం ఉద్యోగుల ప్రయోజనాల కోసం మాత్రమే. వేతన రేటు పెంపుదలకు లేదా తదుపరి వేతన కమిషన్‌కు ఏర్పాటుపై అధికారిక సమాచారం కాదు. కచ్చితమైన సమాచారం కోసం అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్‌లను సందర్శించండి.