8Th Pay Commission Latest News: ప్రతి పది సంవత్సరాలకు కేంద్ర ప్రభుత్వం కొత్త పే కమిషన్ను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షనర్లకు సంబంధించి డీఆర్, ఇతర ప్రయోజనాలను పే కమిషన్ సమీక్షించి కేంద్రానికి సిఫార్సులు పంపిస్తుంది. ఈ సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వం ఉద్యోగులకు ప్రయోజనాలు చేకురేవిధంగా నిర్ణయం తీసుకుంటుంది.
8th pay commission ఏర్పాటు చేయాలని చాలా కాలంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కొత్త పే కమిషన్ అమలైతే జీతాలు ఒకేసారి భారీ మొత్తంలో పెరుగుతాయి.
వచ్చే ఏడాది మార్చి నెలలో కేంద్రం ప్రభుత్వం బడ్జెట్ ప్రకటన సందర్భంగా 8th pay commission ఏర్పాటు ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.
ప్రస్తుతం 7th pay commission అమలు అవుతుండగా.. ఉద్యోగుల బేసిక్ రూ.18 వేలు ఉంది. కొత్త పే కమిషన్ అమల్లోకి వస్తే.. కనీస వేతనం రూ.34,500 అవుతుందని అంచనా వేస్తున్నారు.
దీపావళి సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం డీఏ పెరిగింది. దీంతో మొత్తం 53 శాతానికి చేరింది. పెరిగిన జీతాలు జూలై 1వ తేదీ నుంచి అమలు చేశారు
వచ్చే ఏడాది జనవరిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో డీఏ పెంపు ఉండనుంది. ALL INDIA CONSUMER PRICE INDEX (AICPI) డేటా ఆధారంగా జీతాల పెంపు ఉంటుంది.