Women Earn: మహిళా CEOలు పురుషుల కంటే ఎక్కువ సంపాదిస్తారా? మగజాతికి షాక్ పుట్టించే రిపోర్ట్

Women earn more than men: స్త్రీలు పురుషులతో పోటీపడి అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. అయితే కొన్ని రంగాల్లో మాత్రం పురుషులను దాటి ముందుకు వెళ్లిపోయారు. తాజాగా అమెరికాలో విడుదలైన ఓ రిపోర్టులో సీఈవో స్థాయిలో పురుషుల కన్నా స్త్రీలకే వేతనం ఎక్కువగా లభిస్తోందని తేలింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
 

1 /7

Women earn more than men: ఉద్యోగం పురుష లక్షణం అనేది ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు స్త్రీలు పురుషులతో పోటీపడి ఉద్యోగాలు చేస్తున్నారు. ఉద్యోగం మాత్రమే కాదు పలు కార్పొరేట్ కంపెనీలకు సీఈవో స్థాయిలోనూ చైర్మన్ స్థాయిలో కూడా మహిళలు రాణిస్తున్నారు. తాజాగా విడుదలైన ఓ రిపోర్టు ప్రకారం పలు కంపెనీలో సీఈవో స్థాయిలో పనిచేసే స్త్రీ పురుషుల జీతంలో తీవ్ర వ్యత్యాసం ఉంది. అమెరికాలోని ఓ ప్రముఖ సంస్థ విడుదల చేసిన ఓ రిపోర్ట్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అమెరికాలోని పెద్ద కంపెనీల్లో సీఈఓ హోదాలో ఉన్న మహిళలు పురుషుల కంటే చాలా ఎక్కువ సంపాదిస్తున్నారు.   

2 /7

ఈ నివేదిక ప్రకారం, అమెరికాలోని టాప్ 500 కంపెనీల్లోని మహిళా సీఈవోల జీతం పురుషుల కంటే ఎక్కువగా ఉన్నాయి. మహిళలు 16.5 మిలియన్ డాలర్లు ప్యాకేజీని పొందగా, పురుషుల జీతం కేవలం 15.6 మిలియన్ డాలర్లుగా ఉంది.  

3 /7

అయితే స్త్రీ, పురుషుల వేతనాల్లో వ్యత్యాసం కనిపించడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది మార్చి ప్రారంభంలో, న్యూజిలాండ్ నుండి కూడా ఇదే విధమైన నివేదిక వచ్చింది. న్యూజిలాండ్‌లో మహిళా సీఈఓ సగటు జీతం 5.9 మిలియన్ డాలర్లు అంటే రూ. 41 కోట్లుగా ఉండగా, పురుష సీఈఓ జీతం  రూ.20 కోట్లు మాత్రమే.  

4 /7

2023 నివేదిక ప్రకారం, ఆస్ట్రేలియాలో కూడా, మహిళా CEO ల జీతం పురుషుల కంటే చాలా ఎక్కువగా ఉంది. అయితే కేవలం కొన్ని సర్వేల ఆధారంగానే ఈ నివేదికలు రూపొందించారు. ప్రపంచ వ్యాప్తంగా మహిళా CEOలు పురుషుల కంటే ఎక్కువ సంపాదిస్తున్నారని దీని అర్థం కాదు.   

5 /7

అమెరికాకు సంబంధించిన నివేదికల్లో కేవలం 40 మంది మహిళా సీఈవోల జీతాలపై సర్వే చేసింది. ఇది అమెరికాలోని మొత్తం CEOలలో కేవలం 7.9 శాతం మాత్రమే.  

6 /7

స్త్రీల కంటే పురుషులు ఇప్పటికీ చాలా ఎక్కువ సంపాదిస్తున్నారు. కాగా జనాభా లెక్కల ప్రకారం చూసినట్లయితే చాలా మంది ఉద్యోగం చేసే మహిళల జీతం పురుషుల కంటే 15శాతం తక్కువగానే ఉంటుంది. అయితే మన దేశంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది.ఇప్పటికీ కింది స్థాయిలో స్త్రీ పురుషుల మధ్య వేతనాల విషయంలో వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంటుంది.  

7 /7

అయినప్పటికీ స్త్రీలు ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా పనిచేసేందుకు సిద్ధంగా ఉంటున్నారు. మహిళలు ఎక్కువగా పనిలో భాగస్వామ్యం అవడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుందని జిడిపి పెరుగుతుందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. పెరుగుతున్న ఖర్చులను దృష్టిలో ఉంచుకొని ఒక కుటుంబంలో స్త్రీ పురుషులు ఇద్దరూ కష్టపడితేనే ఇల్లు గడిచే పరిస్థితులు భవిష్యత్తులో రాబోతున్నాయి.