Abhishek Sharma Love Story: టీమిండియా నయా స్టార్ అభిషేక్ శర్మ ప్రస్తుతం ఫుల్ ట్రెండింగ్‌లో ఉన్నాడు. ఐపీఎల్‌లో అదరగొట్టిన ఈ యంగ్ బ్యాట్స్‌మెన్‌కు నేరుగా టీమిండియా సెలెక్టర్ల నుంచి పిలుపు వచ్చింది. జింబాబ్వేతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో దుమ్ములేపుతూ.. భవిష్యత్ ఆశాకిరణంగా కనిపిస్తున్నాడు. ముఖ్యంగా రెండో టీ20 మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగి తన టాలెంట్‌ను నిరూపించుకున్నాడు.
ఈ సీజన్ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫైనల్‌కు చేరిందంటే అందుకు కారణం ఓపెనర్ల మెరుపు ఇన్నింగ్స్. ట్రావిస్ హెడ్‌తో కలిసి అభిషేక్ శర్మ అదరగొట్టే పర్ఫామెన్స్ ఇచ్చాడు.
అభిషేక్ శర్మ దూకుడును మెచ్చిన సెలెక్టర్లు.. జింబాబ్వే టూర్‌కు ఎంపిక చేశారు. మొదటి టీ20లో డకౌట్ అయినా.. రెండో టీ20 సెంచరీతో చెలరేగాడు.
క్రికెట్ విషయం పక్కనపెడితే ఈ యంగ్ ప్లేయర్ జీవితంలో ఓ విషాదగాథ ఉంది. ఎన్నో ఎత్తుపల్లాలను ఎదుర్కొని టీమిండియాకు ఎంపియ్యాడు.
అభిషేక్ శర్మ గర్ల్‌ఫ్రెండ్, మోడల్ తాన్యా సింగ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. గర్ల్‌ఫ్రెండ్ మరణంతో బాధ, పోలీసుల విచారణ అన్నింట నడుమ ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చాడు.
బాధను దిగమింగుతూ ఐపీఎల్‌లో ఓపెనర్‌గా అదరగొట్టాడు. దీంతో టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు.
జింబాబ్వేపై రెండో టీ20 మ్యాచ్‌లో కేవలం 47 బంతుల్లో 100 పరుగులు చేశాడు. ఇందులో 7 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి.