Divya Bharathi: సుడిగాలి సుధీర్‌ హీరోయిన్‌కు అవమానం.. కాలేజీ రోజుల్లో వేధింపులు

Actress Divya Bharathi Emotional: కన్నడ సినిమాలో హీరోయిన్‌గా రాణిస్తున్న దివ్య భారతి తాజాగా తనకు కలిగిన అవమానాలను పంచుకున్నారు. కళాశాల రోజుల్లో తనను సూటిపోటీ మాటలతో వేధింపులకు గురి చేశారని.. ఆ తర్వాత ఇప్పుడు నన్ను గౌరవిస్తున్నారని తెలిపారు.

1 /10

మోడలింగ్‌ రంగంలో రాణించిన కోయంబత్తూరుకు చెందిన దివ్యభారతి ప్రస్తుతం సినిమాల్లో బిజీబిజీ అయ్యారు.

2 /10

తొలి సినిమాతోనే తన అందం.. నటనతో ప్రేక్షకుల మనసులను ఆమె గెలుచుకున్నారు.

3 /10

సినీ పరిశ్రమలోకి రాకముందు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా రాణించారు. తన గ్లామర్‌తో ఫాలోవర్లను అనూహ్యంగా పెంచేసుకున్నారు.

4 /10

జీవీ ప్రకాష్‌ దర్శకత్వం వహించిన 'బ్యాచిలర్‌' సినిమాతో హీరోయిన్‌గా దివ్య భారతీ అరంగేట్రం చేసింది. మదిల్ మెయిల్ కాదల్ అని రెండో సినిమా చేసింది.

5 /10

రెండు సినిమాలతోనే కుర్రకారును తన వైపునకు తిప్పుకున్న దివ్య భారతి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సంచలన విషయాలు తెలిపారు. 

6 /10

తన కళాశాల రోజుల్లో తన శరీరాకృతిపై తోటి విద్యార్థులు ఆట పట్టించారని దివ్య భారతి వాపోయింది. "ఫాండా బాటిల్", "అస్థి పంజరం" వంటి సూటిపోటీ మాటలు అన్నారని దివ్య భారతి వెల్లడించింది. 

7 /10

వాళ్లు చేసిన కామెంట్లు నాపై చాలా ప్రభావం చూపాయి. ఆ మాటలతో తన శరీరంపైనే అసహ్యాం వేసినట్లు తెలిపింది. ఆ మాటలతో తాను ప్రజల ముందు నడవడానికి కూడా భయపడినట్లు చెప్పింది.

8 /10

అనంతరం మోడలింగ్‌లో రాణించడంపై మాట్లాడుతూ.. '2015లో ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా తెరిచాను. అప్పుడు నా మోడలింగ్ ప్రయాణం మొదలైంది. నా మార్పు చూసి అందరూ నన్ను మెచ్చుకోవడం ప్రారంభించారు' అని దివ్య భారతి ఆ ఇంటర్వ్యూలో తెలిపింది.

9 /10

'శరీర ఆకృతిని కలిగి ఉండటం ముఖ్యం కాదు. అన్ని విమర్శల మధ్య మిమ్మల్ని మీరు ఎలా ప్రేమిస్తున్నారనేది ముఖ్యం. ఈ విషయం చెప్పడానికి నాకు ఆ రోజుల్లో ఎవరైనా ఉండి ఉంటే బాగుండేది' అని దివ్య తన పాత రోజులను గుర్తు చేసుకుంది.

10 /10

కాగా దివ్య భారతికి సంబంధించిన పాత ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె పాత ఫొటో చూసిన అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దివ్య భారతి తెలుగులో సుడిగాలి సుధీర్‌ 'గోట్‌' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.