Hebah Patel: చీర కట్టులో హెబ్బా పటేల్ లేటెస్ట్ లుక్.. కుమారి 21 భామ పోజులకు నెటిజన్లు ఫిదా

Hebah Patel Photos: చీరకట్టులో అందాల మెరుపులు మెరిపించింది హెబ్బా పటేల్. చురకత్తుల చూపులతో కుర్రకారుకు వల వేస్తూ మాయ చేస్తోంది. తాజాగా షేర్ చేసిన పిక్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. మీరూ ఓ లుక్కేయండి.. 

1 /5

1989 జనవరి 6న ముంబైలో జన్మించిన హెబ్బా పటేల్.. బీఎంఎంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. మొదట కన్నడ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా కెరీర్ మొదలుపెట్టింది.  

2 /5

2014లో 'తిరుమనం ఎనుం నిఖా' అనే తమిళ సినిమాను ముందు కంప్లీట్ చేసినా.. అధ్యక్ష అనే కన్నడ సినిమా మూవీ ముందుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.   

3 /5

తెలుగులో అలా ఎలా..? చిత్రంతో పరిచయం అయింది. ఆ తరువాత కుమారి 21ఎఫ్‌ మూవీ హెబ్బా పటేల్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది.

4 /5

ఈడోరకం ఆడోరకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా, నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్, మిస్టర్, అంధగాడు, ఏంజెల్, 24 కిస్సెస్, ఒరేయ్ బుజ్జిగా వంటి సినిమాలతో ప్రేక్షులను అలరించింది. ఈ ముద్దుగా క్రేజ్ భారీగా ఉన్నా.. స్టార్ హీరోయిన్‌ హోదా మాత్రం దక్కలేదు.   

5 /5

ఓటీటీ సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు, చిన్న సినిమాలతో ప్రస్తుతం కెరీర్‌ను నెట్టుకొస్తోంది హెబ్బా పటేల్. మరోవైపు సోషల్ మీడియాలో అందచందాలతో ఆకట్టుకుంటోంది.