Actress marriage: పెళ్లై, పిల్లలున్న వ్యక్తిని పెళ్లి చేసుకున్న అక్కినేని హీరోయిన్.. వరుడు ఎవరంటే..?

Kalyani Priyadarshi marriage: పెళ్లి చేసుకోవడం సహజం. కానీ పెళ్లయి పిల్లలు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోవడం అనేది.. ఆశ్చర్యకరమైన విషయమే. అది కూడా ఏకంగా ఒక పాపులర్ హీరోయిన్ ఈ పని చేసింది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు.. ఆ హీరోయిన్ ఎందుకు పెళ్లి చేసుకుందాం ఒకసారి చూద్దాం..

1 /5

అక్కినేని అఖిల్ హీరోగా నటించిన హలో సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన యంగ్ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్ తాజాగా ఏడడుగులు వేసినట్లు తెలుస్తోంది. అప్పటికే వివాహం జరిగిన ప్రముఖ బుల్లితెర యాక్టర్ శ్రీరామ్ కస్తూరి మాన్ తో ఆమె ఏడడుగులు వేసినట్లు అందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

2 /5

వాస్తవానికి శ్రీరామ్ కస్తూరి మాన్ కు ఇదివరకే వివాహం జరిగి,  ఒక కూతురు కూడా ఉంది. ఇప్పుడు అతడు కళ్యాణి ప్రియదర్శన్ తో ఏడడుగులు వేయడంతో రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  కట్టుకున్న భార్యకు విడాకులు ఇచ్చి.. ఇప్పుడు ఇంకో వివాహం చేసుకున్నాడు అంటూ నెటిజన్స్ కూడా ఫైర్ అవుతున్నారు. 

3 /5

ఇకపోతే ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఎట్టకేలకు ఈ విషయంపై శ్రీరామ్ స్పందించారు. తాను కళ్యాణి ప్రియదర్శన్ ను వివాహం చేసుకోలేదని.. అది ఎస్ ఇండియా వెడ్డింగ్ కలెక్షన్స్ లో భాగంగా.. యాడ్ షూట్ చేశామని స్పష్టం చేశారు. 

4 /5

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో చాలా వైరల్ గా మారుతుంది. పెళ్లయిన వాడితో ఏడడుగులు వేసింది అని.. కళ్యాణి అభిమానులు నిరాశ వ్యక్తం చేయగా అసలు విషయం తెలుసుకొని ఇదా సంగతి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

5 /5

మరొకవైపు పెళ్లికూతురు గెటప్ లో కళ్యాణి ప్రియదర్శన్ చాల చూడముచ్చటగా ఉంది అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.