Pics: మంచు లక్ష్మి ఫ్యాషన్ ఫొటోషూట్ వైరల్

  • Jul 14, 2020, 17:11 PM IST

మంచు లక్ష్మీప్రసన్న.. తొలి సినిమాతోనే తన టాలెంట్ నిరూపించుకున్న టాలీవుడ్ నటి Manchu Lakshmi Prasanna. ప్రముఖ నటుడు మోహన్ బాబు నట వారసత్వాన్ని అందిపుచ్చుకున్న మంచు లక్ష్మి 2011లో అనగనగా ఓ ధీరుడు సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయమైంది.

1 /6

మంచు లక్ష్మీప్రసన్న.. తొలి సినిమాతోనే తన టాలెంట్ నిరూపించుకున్న టాలీవుడ్ నటి Manchu Lakshmi Prasanna. ప్రముఖ నటుడు మోహన్ బాబు నట వారసత్వాన్ని అందిపుచ్చుకున్న మంచు లక్ష్మి 2011లో అనగనగా ఓ ధీరుడు సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయమైంది. తొలి సినిమాలో విలనిజం పండించి ఉత్తమ విలన్‌గా నంది అవార్డు సొంతం చేసుకున్నారు మంచు లక్ష్మి (Lakshmi Manchu). టెలివిజన్ వ్యాఖ్యాతగా, సినీనటిగా రాణిస్తూనే నిర్మాతగా శ్రీలక్ష్మీప్రసన్న పిక్చర్స్ బ్యానర్‌లో విజయవంతమైన సినిమాలను నిర్మిస్తున్నారు.

2 /6

ప్రస్తుతం లాక్‌డౌన్ టైమ్‌లో మంచు లక్ష్మి మరోసారి ఫ్యాషన్‌ ప్రపంచానికి వెళ్లిపోయారు. కాలేజీ డేస్‌లో ఉండేలా ఫొటోషూట్ చేసి ఆ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 1.2 మిలియన్ల ఫాలోయర్లున్నారు. వీరు మంచు లక్ష్మి  లేటెస్ట్ ఫ్యాషన్ ఫొటోషూట్ చూసి వైరల్ చేస్తున్నారు. న్యూ లుక్ బాగుందంటూ కామెంట్లు, లైక్స్ చేస్తున్నారు. దీంతో మంచు లక్ష్మి ఫ్యాషన్ ఫొటోలు (Lakshmi Manchu Latest Photos) సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

3 /6

మంచు లక్ష్మి సోదరులు మంచు విష్ణు, మంచు మనోజ్ ఇదరూ నటులని తెలిసిందే. దొంగల ముఠా సినిమాలో ఏందిరో అంటూ పాడిన పాటకుగాను గామా అవార్డ్స్‌లో బెస్ట్ సెలబ్రిటీ సింగర్ అవార్డుని అందుకున్నారు.

4 /6

గుండెల్లో గోదారి, చందమామ కథలు సినిమాల్లో ఉత్తమ నటనకుగానూ ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ సహాయ నటి అవార్డులు వరించాయి. గుండెల్లో గోదారి సినిమాకు సైమాలో ఉత్తమ సహాయ నటిగానూ నిలిచారు మంచు లక్ష్మి. అయితే సినిమాల్లోకి రాకముందే ఎన్నారై ఆండీ శ్రీనివాసన్‌తో ఆమె వివాహం జరిగింది. వీరికి ఓ పాప విద్యా నిర్వాణ ఉంది. 

5 /6

మంచు లక్ష్మి చివరగా 2018లో వైఫ్ ఆఫ్ రామ్‌లో నటించారు. తమిళంలో అదే ఏడాది ఓ సినిమా చేశారు. తాజాగా మంచు లక్ష్మి ఫ్యాషన్ లుక్ ఫొటోలు (Lakshmi Manchu Stunning Photos) సోషల్ మీడియాలో షేర్ చేయగా ఆమె ఫాలోయర్లు వాటిపై స్పందిస్తున్నారు.

6 /6

Images Credit: Instagram/Lakshmi Manchu (మంచు లక్ష్మి తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫొటోలు పోస్ట్ చేశారు.)