Actress Sitara: అతను నాకు ఇంకా గుర్తున్నాడు.. అందుకే పెళ్లి చేసుకోలేదు..!

Actress Sitara Interview: 1980 90 సమయంలో నటి సితార గురించి తెలియని వారు ఉండే వాళ్ళు కాదు. భాషతో సంబంధం లేకుండా బోలెడు సినిమాలతో సినిమాలతో ఆమె బిజీగా ఉండేది. కానీ ఇప్పుడు 51 ఏళ్ల వయసులో కూడా అవే పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా ఉండిపోయారు. దానికి కారణం ఆమె ఒకరిని ప్రేమించడం అని.. అతన్ని మర్చిపోలేక పెళ్లికి దూరంగా ఉన్నానని చెబుతున్నారు సితార. 

1 /5

తెలుగులో చాలావరకు సైడ్ క్యారెక్టర్లు చేసిన నటి సితార కన్నడలో చాలా సినిమాలలో హీరోయిన్గా కూడా నటించారు. 1980 సమయంలో ఆమె చేతిలో బోలెడు సినిమా ఆఫర్లు ఉండేది వరుసగా సినిమాలతో బిజీగా ఉండేది. ప్రస్తుతం ఆమె వయసు 51 సంవత్సరాలు. కానీ ఇంకా ఆమె పెళ్లి చేసుకోలేదు. 

2 /5

నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సితార వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఇప్పటివరకు పెళ్లి కూడా చేసుకోకుండా ఇంకా ఒంటరిగానే జీవిస్తున్నారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇప్పటిదాకా ఆమె ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని కారణాన్ని వెల్లడించారు.

3 /5

"నాకు చాలానే పెళ్లి సంబంధాలు వచ్చాయి. కానీ నేను అప్పట్లో ఒకరిని ప్రేమించాను. ఆ ప్రేమ ఎక్కువ రోజులు నిలువ లేదు.. కానీ నేను మాత్రం అతన్ని మర్చిపోలేకపోయాను. అతని గురించి ఆలోచిస్తూ ఉండడంతో ఎవరిని పెళ్లి చేసుకోవాలని ఆలోచన కూడా నాకు రాలేదు" అని అన్నారు సితార. 

4 /5

"పెళ్లి చేసుకోకపోవడానికి మరొక బలమైన కారణం.. నా తండ్రి పరమేశ్వరన్ నాయర్ కి చాలా దగ్గరగా ఉంటాను. నా తల్లిదండ్రులను విడిచిపెట్టకుండా.. ఉండటానికి పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేను. నా తండ్రి మరణం తర్వాత, పెళ్లి చేసుకోవాలనే ఆలోచన పూర్తిగా మాయమైంది," అని సితార అన్నారు.

5 /5

తెలుగులో భరత్ అనే నేను, భలే భలే మగాడివోయ్, అరవింద సమేత వీర రాఘవ ఇలా పలు సినిమాల్లో నటించిన సితార గత కొంతకాలంగా ఒకటి రెండు సినిమాలు తప్ప ఎక్కువ చేయలేదు. ఆఖరిసారిగా ఆమె ఈ మధ్యనే తమిళ్లో విడుదలైన హిట్ లిస్ట్ సినిమాలో కనిపించారు.