Aditi Rao Hydari Photos:
అదితి రావు హైదరి .. ప్రజాపతి అనే మలయాళ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ సమ్మోహనం సినిమాతో తెలుగు ప్రేక్షకులను సైతం మంత్రముగ్ధుల్ని చేసింది. ప్రస్తుతం ఈ హీరోయిన్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
Aditi Rao Hydari Instagram Pics: ప్రజాపతి అనే మలయాళం సినిమా ద్వారా సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్ అదితి రావు హైదరి.
ఆతర్వాత అక్కడి నుంచి తమిళ్ ఇండస్ట్రీకి వెళ్ళింది. అక్కడ సిరినగరం అనే సినిమాలో నటించింది. బాలీవుడ్లో సైతం కొన్ని సినిమాలలో నటించింది ఈ హీరోయిన్.
బాలీవుడ్లో అదితి నటించిన ఢిల్లీ 6 మంచి విజయాన్ని అందుకోవడంతో హిందీలో వరుస అవకాశాలను సొంతం చేసుకుంది.
కాగా సమ్మోహనం అనే సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టింది. ఆ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మదిలో చోటు సంపాదించుకుంది ఈ నటి. ఆ తర్వాత నుంచి తెలుగులో కూడా బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు అందుకుంటూ వచ్చింది.
అంతరిక్షం, వి, మహా సముద్రం సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది. సినిమాలలోనే కాదు ఈ హీరోయిన్ సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్ గా ఉంటుంది.
సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మకు విపరీతమైన ఫాలోయింగ్ కూడా ఉంది. తాజాగా అధితి రావు షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి. పసుపు రంగు దృష్టిలో ఎంతో పద్ధతిగా కనిపిస్తూ అందరిని ఫిదా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.