Indiramm Illu: ఏఐ టెక్నాలజీతో ఇందిరమ్మ ఇళ్లు.. ప్రభుత్వం కీలక ఆదేశాలు..

AI Technology In Indiramma Illu : ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులను ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) టెక్నాలజీతో విస్తృతంగా లబ్ది పొందే విధానాన్ని గుర్తించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి నిన్న అధికారులతో జరిగిన సమావేశంలో చెప్పారు. ఇలా చేయడం వల్ల ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఎలాంటి అవినీతికి ఆస్కారం ఉండదన్నారు. 
 

1 /5

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ తెలంగాణ స్టేట్‌ సెక్రటేరియట్‌లో బుధవారం జనవరి 29న జరిగిన సమావేశంలో మంత్రి పొంగులేటి రివ్యూ మీటింగ్‌ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు లబ్ది చేకూరడంలో ఎలాంటి అవినీతి జరగకుండా ఉండటానికి ఏఐ టెక్నాలజీని ఉపయోగించాలన్నారు.  

2 /5

ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులు, లబ్ది పొందే విధానం అంటే ఇంటి నిర్మాణం దశలవారీగా పూర్తయ్యే వరకు ఈ ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తూ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. ఇప్పటికే లబ్దిదారులకు సంబంధించి ఇందిరమ్మ ఇల్లు యాప్‌ను కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ యాప్‌లో లబ్దిదారులకు సంబంధించిన వివరాలను పొందుపర్చారు.  

3 /5

అయితే మంత్రి పొంగులేటి అధికారులను ఇంటి నిర్మాణం, లబ్దిదారులకు చెల్లింపులు జరుగుతున్నప్పుడు ఏఐతో ఎప్పటి కప్పుడు పర్యవేక్షించాలన్నారు. అప్పుడే పథకంలో ఎలాంటి అవినీతికి తావుండదన్నారు.  

4 /5

సర్వే నిర్వహించి అర్హులెవరు, అనర్హులు ఎవరు అనేది నిర్ధారించాలన్నారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి నాలుగు దశలుగా నిధులు మంజూరు చేస్తారు. ఈ ఏఐ టెక్నాలజీ సారథ్యంలోనే చెల్లింపులు జరగాలన్నారు.   

5 /5

ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని 76వ రిప్లబిడ్‌ డే సందర్భంగా ప్రారంభించారు. మొదటి దశలో 72వేల మందికి ఇళ్ల మంజూరు లెట్టర్‌ను ఇచ్చారు. ఇంటి నిర్మాణాలు త్వరగా చేపట్టాలని అధికారలకు కూడా మార్గదర్శకాలు మంత్రి జారీ చేశారు.

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x