Air India: ఎయిర్ ఇండియా అంతర్జాతీయ మార్గాలైన న్యూయార్క్, లండన్, పారిస్, సింగపూర్‌లలో ఇప్పటికే ఉచిత వై-ఫై అందిస్తోంది. ఇప్పుడు డొమెస్టిక్ రూట్‌లో దీన్ని ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తోంది. న్యూ ఇయర్ కానుకగా ఎయిరిండియా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Air India Free Wi-Fi: కొత్త సంవత్సరం సందర్భంగా ఎయిర్ ఇండియా తన ప్రయాణికులకు భారీ కానుకను అందించింది. దేశీయ విమానాల్లో ఉచిత Wi-Fi ఇంటర్నెట్‌ను ప్రారంభించిన తొలి భారతీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా నిలిచింది.
ఎయిర్‌బస్ A350, బోయింగ్ 787-9, Airbus A321neo విమానంలో ప్రయాణించేవారు ఇంటర్నెట్‌ని బ్రౌజ్ చేయగలరని, సోషల్ మీడియాను వీక్షించగలరని, 10,000 అడుగుల పైన ఎగురుతున్నప్పుడు పని చేయగలుగుతారని ఎయిర్ ఇండియా విడుదల చేసిన పత్రికా ప్రకటన తెలిపింది .
దేశీయ విమానాల్లో ఉచిత Wi-Fi సౌకర్యం అందుబాటులో ఉంటుంది: ఎయిర్ ఇండియా అంతర్జాతీయ రూట్లలో న్యూయార్క్, లండన్, పారిస్, సింగపూర్‌లలో ఈ సేవ ఇప్పటికే అందిస్తోంది. ఇప్పుడు ఇది పైరేట్ ప్రాజెక్ట్ ప్రోగ్రామ్ కింద దేశీయ మార్గంలో ప్రారంభించింది.
ఎయిర్ ఇండియా కాలక్రమేణా తన విమానాల ఇతర విమానాలలో ఈ సేవను ప్రారంభించాలని యోచిస్తోంది. ఐఓఎస్ లేదా ఆండ్రాయిడ్ ఓఎస్‌తో కూడిన ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, స్మార్ట్‌ఫోన్‌లలో వై-ఫై సేవ ఉచితంగా లభిస్తుందని ఎయిర్‌లైన్ తెలిపింది.
ఎయిర్ ఇండియా చీఫ్ కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ ఆఫీసర్ రాజేష్ డోగ్రా మాట్లాడుతూ, కనెక్టివిటీ ఇప్పుడు ఆధునిక ప్రయాణాలలో అంతర్భాగంగా మారిందని అన్నారు. మా ప్రయాణీకులు వెబ్‌కు కనెక్ట్ అయ్యే సౌలభ్యాన్ని అభినందిస్తారని.. విమానంలో కొత్త ఎయిర్ ఇండియా అనుభవాన్ని ఆస్వాదిస్తారని మేము విశ్వసిస్తున్నామని ఆయన అన్నారు.
ఎయిర్ ఇండియాలో ప్రయాణికులు Wi-Fiని ఎలా పొందవచ్చు మీ డివైసులో Wi-Fiని ప్రారంభించి, Wi-Fi సెట్టింగ్‌లకు వెళ్లండి. ఇప్పుడు ఎయిర్ ఇండియా వై-ఫై నెట్‌వర్క్‌పై క్లిక్ చేయండి. తర్వాత మీరు మీ బ్రౌజర్‌లో ఎయిర్ ఇండియా పోర్టల్‌కి చేరుకున్న తర్వాత, మీ PNR, చివరి పేరును నమోదు చేయండి. అంతే సింపులు మీ డివైసుకు ఫ్రీ వైఫై కనెక్ట్ అవుతుంది.