Air India tata deal : ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ 68 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు టాటా సన్స్ గూటికి చేరింది. టాటా సన్స్ వేసిన బిడ్ను ఆమోదిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. గతంలో టాటా సంస్థ స్థాపించిన ఎయిర్ ఇండియా సంస్థను భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న అర్థ శతాబ్దం దాటింది. ఇప్పుడు మళ్లీ మాతృసంస్థ టాటా ఎయిర్ ఇండియాను రూ. 18,000 కోట్లకు బిడ్ వేసి సొంతం చేసుకుంది.
Air India tata deal Air India Disinvestment From Centre buying carrier to saying Tata check airlines journey so far : ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ టాటా సన్స్ చేతుల్లోకి వెళ్లిపోయింది. టాటా సంస్థ ఎయిర్ ఇండియాను రూ. 18,000 కోట్లకు బిడ్ వేసి తన సొంతం చేసుకుంది. ఇక ఈ విక్రయానికి సంబంధించిన విధి విధానాలన్నీ కూడా 2021 డిసెంబర్ నాటికి పూర్తవుతాయి.
68 ఏళ్ల తర్వాత మళ్లీ తన ఎయిర్ ఇండియా విమానయాన సంస్థను దక్కించుకున్నటాటా సన్స్... టాటా సన్స్ వేసిన బిడ్ను ఆమోదించిన కేంద్ర ప్రభుత్వం. (Image Credits: Indian Diplomacy/Twitter)
విక్రయానికి సంబంధించి 2021 డిసెంబర్ నాటికి పూర్తికానున్నవిధి విధానాలు
ఈ ఏడాది ఆగస్ట్ 31 నాటికి రూ. 61,562 కోట్ల రుణభారంతో ఉన్న ఎయిర్ ఇండియా
ఒకప్పుడు టాటా సంస్థ స్థాపించిన ఎయిర్ ఇండియా సంస్థను భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకుని అర్థ శతాబ్దం పైనే అయ్యింది. ఇప్పుడు టాటా సంస్థ రూ. 18,000 కోట్లకు బిడ్ వేసి మళ్లీ ఎయిర్ ఇండియాను తన సొంతం చేసుకుంది.
ఎయిర్ ఇండియా బిడ్ను టాటా సన్స్ గెల్చుకున్నట్లు అధికారిక ప్రకటన వెలువడిన వెంటనే 'వెల్కమ్ బ్యాక్ ఎయిర్ ఇండియా' అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు రతన్ టాటా. (Image Credits:Twitter)
టాటా సన్స్ చైర్మన్ ఎమిరిటస్ హోదాలో ఉన్న రతన్ టాటా, జెఆర్డీ టాటా నాయకత్వంలో నడిచిన ఎయిర్ ఇండియా గతంలో ప్రపంచంలోని ప్రతిష్ఠాత్మక విమానయాన సంస్థల్లో ఒకటిగా గుర్తింపు పొందిందని గుర్తు చేసుకున్నారు రతన్ టాటా.