Allu Arjun Networth: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయారు ఇక ఇప్పుడు పుష్పార్టు సినిమా కూడా రిలీజ్ చేసి మరింత క్రేజ్ అందుకున్నారు ఇక ఈ సినిమా తర్వాత ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసింది ఇకపోతే తాజాగా ఈయన ఆస్తి వివరాలు వైరల్ గా మారుతున్నాయి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా గుర్తింపు సొంతం చేసుకున్నారు అల్లు అర్జున్. మొదట మెగా ఫ్యామిలీ సపోర్ట్ తో ఇండస్ట్రీ లోకి వచ్చిన ఈయన ఇప్పుడు సొంతంగా తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకొని స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు పుష్ప -2 విడుదల చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు.
ఇదిలా ఉండగా ఈ సినిమా కోసం అల్లు అర్జున్ ఏకంగా రూ.300 కోట్ల పారితోషకం తీసుకొని ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోగా పేరు దక్కించుకున్నారు. దీంతో ఆయన ఆస్తి విలువలు కూడా భారీగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే ఒకవైపు సినిమాలు, మరొకవైపు యాడ్స్, వ్యాపార సంస్థలు అలా అన్నింటినీ కలుపుకొని ఆయన ఆస్తులు వివరాలు ఇప్పుడు మరింత వైరల్ గా మారుతూ ఉండడం గమనార్హం.
2024 నాటికి అల్లు అర్జున్ నికర ఆదాయం రూ.460 కోట్లుగా అంచనా వేయబడింది. హైదరాబాదులో విలాసవంతమైన ఇంటిని కూడా ఆయన కలిగి ఉన్నారు. ఈ ఇంటి విలువ రూ.100 కోట్ల పైమాటే. సహజమైన తెలుపు రంగులో పెయింట్ చేయబడింది. ఇండోర్ జిమ్, స్విమ్మింగ్ పూల్ , హోమ్ థియేటర్, పిల్లల కోసం పెద్ద ఆటస్థలం అన్నింటిని కూడా ఆయన ఏర్పాటు చేశారు.
ఇకపోతే ఈయన కారు గ్యారేజ్ లో రేంజ్ రోవర్ వోగ్, హమ్మర్ హెచ్ 2, జాగ్వార్ ఎక్స్ జె ఎల్, వోల్వో ఎక్స్ సి 90 T8 తోపాటు మరిన్ని విలువైన కార్లు ఆయన గ్యారేజ్ లో ఉన్నట్లు సమాచారం.
ఇక అలాగే అల్లు స్టూడియోని కూడా స్థాపించారు. ఈ స్టూడియో 10 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. చలనచిత్ర నిర్మాణంతో పాటు టెలివిజన్ నిర్మాణంపై కూడా ఇక్కడ దృష్టి పెడతారు. అలాగే అల్లు ఫ్యామిలీకి గీతా ఆర్ట్స్ అనే చిత్ర నిర్మాణ సంస్థతో పాటు ఓటీటీ ఆహా సంస్థ కూడా ఉంది. హైదరాబాద్ ఆధారిత హెల్త్ కేర్ స్టార్ట్ అప్ అయిన కాల్ హెల్త్ సర్వీస్ లో పెట్టుబడి పెట్టారు. ఈ కంపెనీ ఆన్లైన్ సంప్రదింపుల ద్వారా వైద్య సేవలను అందిస్తుంది.