EPFO Pension Updates: ఈపీఎఫ్‌ఓ సభ్యులకు బిగ్‌ అప్‌డేట్.. కనీస పెన్షన్ పెంపుపై కేంద్రం క్లారిటీ

EPFO Latest Updates: ఈపీఎఫ్‌ఓ కింద చాలా కాలంగా పనిచేస్తున్న ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన వారికి పెన్షన్ స్కీమ్ (EPS) 1995 ప్రకారం కనీస పెన్షన్‌ను పెంచాలని చాలా రోజులుగా డిమాండ్స్ వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఈపీఎస్, 1995 కింద కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచడంపై లోక్‌సభలో ఓ ప్రశ్న అడిగారు. కనీస పెన్షన్‌ను పెంచాలని కోరుతూ పింఛనుదారుల నుంచి ప్రభుత్వానికి ఏదైనా దరఖాస్తు వచ్చిందా..? అని కూడా ఆయన అడిగారు. పెన్షన్ పెంపునకు సంబంధించిన ప్రతిపాదనల వివరాల గురించి ఆరా తీశారు.
 

1 /7

ఈ ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానం ఇచ్చారు. ఈపీఎస్ కింద కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచాలని కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు అభ్యర్థన వచ్చిందని తెలిపారు.  

2 /7

ఈపీఎస్ పెన్షన్‌లను పెంచేందుకు ప్రభుత్వం ఈ ప్రాతినిధ్యాలపై ఏదైనా అంచనా వేసిందా..? అని కూడా ఒవైసీ అడిగారు.   

3 /7

మంత్రి సమాధానం ఇస్తూ.. “EPS 1995 అనేది 'డిఫైన్డ్ కంట్రిబ్యూషన్-డిఫైన్డ్ బెనిఫిట్' సామాజిక భద్రతా పథకం. ఉద్యోగుల పెన్షన్ ఫండ్ కార్పస్ (i) వేతనంలో యజమాని నుంచి 8.33 శాతం సహకారం అందుతుంది.   

4 /7

నెలకు రూ.15,000 వరకు వేతనాలలో 1.16 శాతం వరకు బడ్జెట్ వరకు కేంద్ర సహకారం ఉంటుంది.." అని తెలిపారు.  

5 /7

ఈ స్కీమ్ కింద అన్ని ప్రయోజనాలు ఈపీఎస్ ఫండ్ నుంచి చెల్లిస్తామని.. ప్రతి సంవత్సరం ఫండ్ మూల్యాంకనం ఉంటుందన్నారు. 31 మార్చి 2019 నాటికి ఫండ్ వాల్యుయేషన్ ప్రకారం యాక్చురియల్ నష్టం ఉందని వెల్లడించారు.  

6 /7

2014లో తొలిసారిగా ప్రభుత్వం ఈపీఎస్ 1995 కింద పింఛనుదారులకు నెలకు కనీసం రూ.1000 పెన్షన్ ఇచ్చిందని మంత్రి తెలిపారు.   

7 /7

అయితే కార్మిక మంత్రిత్వ శాఖ ఈపీఎస్-95 కింద పెన్షన్‌ను నెలకు రూ.2 వేలకి రెట్టింపు చేయాలని గతేడాది ప్రతిపాదించగా.. కేంద్రం నంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు.