Anant ambani Wedding: రిలయన్స్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. ముఖేష్ అంబానీ ఇచ్చిన సర్ ప్రైజ్ గిఫ్ట్ లు ఏంటో తెలుసా..?

Anant and Radhika wedding: అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల పెళ్లి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకకు ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ ముస్తాబైంది.

1 /7

రిలయన్స్ అధినేత, ప్రపంచదిగ్గజ బిజినెస్ దిగ్గజం చిన్న కుమారుడు అనంత్ , రాధికల పెళ్లి వేడుకలకు అన్నిరకాల ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ జంట పెళ్లి ఈరోజు (జూలై 12) అతిరథ మహారథుల మధ్య జరగనుంది. ఈ వేడుక ముంబైలోని జియోవరల్డ్ లో సెంటర్ లో జరుగనుంది.

2 /7

దేశ విదేశాల నుంచి వచ్చే వీఐపీలు, వీవీఐపీల కోసం.. అంబానీ ఫ్యామిలీ.. ఇప్పటికే మూడు ఫాల్కన్  2000 జెట్ లు, 100 ప్రైవేటు విమానాలను అద్దెకు తీసుకున్నట్లు తెలుస్తోంది.

3 /7

అతిథులకు ఎక్కడ కూడా అసౌకర్యం కల్గకుండా, అంబానీ కుటుంబం అన్నిరకాల ఏర్పాట్లను ఇప్పటికే పూర్తిచేసినట్లు తెలుస్తోంది. వరల్డ్ లోనే అనంత్ రాధికల వివాహాం కాస్లీ పెళ్లిళ్లలో ఒకటిగా ఉండబతుందని సమాచారం.

4 /7

ఇప్పటికే ఈ పెళ్లికి దాదాపు.. 3000 రకాల ఫుడ్ ఐటమ్స్ లను కూడా చేయడానికి ఆర్డర్ లు పెట్టారంట. వందలాది రకాలు స్వీట్లు, దేశం నలుమూలల నుంచి మాస్టర్ షేఫ్ లను రప్పించారంట. అంబానీ ఇంట్లో జరిగిన పెళ్లిని కొన్ని తరాల వరకు చెప్పుకునేలా ఏర్పాటు చేశారని తెలుస్తోంది.

5 /7

ఇదిలా ఉండగా.. ముఖేష్ అంబానీ రిలయన్స్ ఉద్యోగులకు సైతం.. ఊహించని విధంగా సర్ ప్రైజ్ చేశారని తెలుస్తోంది. ఇప్పటికే రిలయన్స్ కంపెనీల ఉద్యోగులకు ఇన్వీటేషన్ పంపించిన సంస్థ.. తాజాగా, వెడ్డింగ్ గిఫ్ట్ లు కూడా పంపించిందంట. ఎరుపు రంగు బాక్స్ లో నూతన వధువరులు పేర్లు, నాలుగు రకాల తినుబండారాలు ఉండేలా  ప్లాన్ చేశారంట.

6 /7

ఆలూ భుజియా, సేవ్ (మురుకులు), చిడ్వా, తో పాటు ప్రతి ఒక్క ఉద్యోగికి సిల్వర్ కాయిన్ లను కూడా ఇస్తున్నారంట.  తమ యజమానులు పంపిన కానుకల ఫోటోలను కొందరు సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇప్పుడివి వైరల్ గా మారాయి.

7 /7

ఇప్పటికే అంబానీ కుటుంబం పెళ్లి వేడుకకు ముందు.. 50 మంది పేదలకు పెళ్లి వేడుక నిర్వహించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఈరోజు అనంత్ రాధికల పెళ్లి, 13న శుభ్ ఆశీర్వాద్, 14న మంగళ ఉత్సవ్ వంటి కార్యక్రమాలు వైభవంగా జరుగుతాయి.