Anchor Sreemukhi: థాయిలాండ్‌లో యాంకర్ శ్రీముఖి సందడి.. బర్త్ డే ట్రిప్‌లో రాములమ్మ

Anchor Sreemukhi Birthday Celebrations: యాంకర్ శ్రీముఖి బర్త్‌ డే వేడుకలను థాయిలాండ్‌లో జరుపుకుంది. వారం రోజులపాటు అక్కే మకాం వేసిన ఈ ముద్దుగుమ్మ బంధు మిత్రులతో కలిసి చిల్ అయింది. ఇందుకు సంబంధించి పిక్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. మీరూ చూసేయండి. 
 

1 /5

థాయిలాండ్‌లోని ఫుకెట్ నగరంలోని ఫేమస్ జూను శ్రీముఖి సందర్శించింది. డిఫరెంట్ పోజుల్లో పిక్స్ దిగుతూ సందడి చేసింది.   

2 /5

ప్రస్తుతం చేతినిండా షోలతో శ్రీముఖి బిజీగా ఉంది. ఆ ఛానెల్.. ఈ ఛానెల్ అనే తేడా లేకుండా ఎక్కడ అవకాశం వచ్చినా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది.  

3 /5

పటాస్ షోతో యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి.. తన మాటతీరుతో బుల్లితెర రాములమ్మగా పేరు తెచ్చుకుంది.  

4 /5

బిగ్‌బాస్  సీజన్ 3లో ఎంట్రీ ఇచ్చి అభిమానులను అలరించింది. సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌తో చివరి వరకు టైటిల్ కోసం పోటీ పడి రన్నరప్‌గా నిలిచింది.   

5 /5

మరోవైపు వెండితెరపై కూడా మెరుస్తోంది శ్రీముఖి. మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ మూవీలో శ్రీముఖికి మంచి రోల్ దక్కినట్లు సమాచారం.