Chandrababu naidu: చేతకాకపోతే వెళ్లిపోండి.. అధికారులకు చంద్రబాబు మాస్ వార్నింగ్.. అసలేం జరిగిందంటే..?


Chandrababu naidu serious: ఆంధ్ర ప్రదేశ్ లో పలుప్రాంతాలు ఇప్పటికి కూడా జలదిగ్బందంలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో..సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా రంగంలోకి దిగడమే కాకుండా.. మంత్రులు, అధికారుల్నిసైతం పరుగులు పెట్టిస్తున్నారు.
 

1 /6

రెండు తెలుగు రాష్ట్రాలలో కుండపోతగా వర్షంకురిసింది.  ఈ క్రమంలో తెలుగు ప్రజలు బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో కూడా అనేక ప్రాంతాలు వరదల వల్ల ముంపుకు గురయ్యాయి. అంతేకాకుండా.. విజయవాడ మాత్రం వర్షాల వల్ల పూర్తిగా అతలాకుతలంగా మారిపోయిది.

2 /6

గత 30 ఏళ్లలో విజయవాడలో ఇంతటి వరదలు ఎప్పుడు రాలేదని కూడా స్థానికులు వాపోతున్నారు. ఇదిలా ఉండగా.. విజయవాడల పూర్తిగా జలదిగ్భందంలో ఉందని చెప్పుకొవచ్చు. ఏకంగా సీఎం చంద్రబాబు విజయవాడ చేరుకుని అక్కడి వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు.

3 /6

అంతేకాకుండా.. మంత్రులు, అధికారుల్ని సైతం ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. బాధితులకు ఆహారం, నిత్యవసారాలు అందేలా చూడాలని కూడా దగ్గరుండి చూసుకుంటున్నారు. పలు మార్లు బోటులో కూడా ప్రయాణించి బాధితుల గొడును సైతం విన్నారు.  

4 /6

ఈ క్రమంలో కొంత మంది అధికారులు ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా పనులు చేస్తున్నారని మంత్రులు ఫిర్యాదులు చేశారు. వరద ప్రభావిత ప్రాంతాలలో డ్యూటీలలో ఉండికూడా.. ప్రజలకు ఎలాంటి సహాయం చేయకుండా.. ఇష్టమున్నట్లు వ్యవహారిస్తున్నారు. వీరంతా జగన్ అనుకూల అధికారులు ఇలాంటి పనులు చేస్తున్నారిని కూడీ చంద్రబాబుకు అనేక ఫిర్యాదులు అందాయి. 

5 /6

ముఖ్యంగా.. ఇవాళ నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారులు కొల్లి రఘురామిరెడ్డి, విజయరావు, గోపాలకృష్ణ ద్వివేది, విజయారావులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.  పని చేయడం ఇష్టం లేకపోతే ఇంటికి వెళ్లిపోవాలని హెచ్చరించారు. కాగా వరద సహాయక చర్యలపై మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ (సోమవారం) సమీక్ష నిర్వహించారు.  

6 /6

బుడమేరు ముంపు ప్రాంతంలో డ్యూటీలో ఉన్న కొంత మంది ఉన్నతాధికారులు కావాలని ఆహారం, నిత్యవసారాలు పంపిణిలో పూర్తిగా పట్టించుకోవట్లేదని సమాచారం. దీనివల్ల ఆహారం , ఇతర పదార్థాల పంపిణిలో తీవ్ర జాప్యం ఏర్పడింది. వీరంతా ఉద్దేశ్యపూర్వకంగా ఇలా చేసినట్లు కూడా ఫిర్యాదులు అందాయి. దీంతో చంద్రబాబు సీరియస్ అయినట్లు తెలుస్తోంది.