Russia destroys Antonov an225 : ప్రపంచంలోనే అతి పెద్ద ఎయిర్ క్రాఫ్ట్‌ని నాశనం చేసిన రష్యా!

Russia destroys Antonov an225: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధంతో ఉక్రెయిన్​లో విలువైన ఆస్తులు ధ్వంసమయ్యాయి. తమ సైనిక స్థావరాలపై రష్యా దాడులతో ప్రపంచంలోనే అతిపెద్ద కార్గొవిమానమైన ఆంటోనోవ్​ ఏఎన్​-225  దెబ్బతిందని ఉక్రెయిన్ వెల్లడించింది. అయితే తాము ఆ విమానాన్ని పునరుద్ధరించనున్నట్లు మాత్రం వెల్లడించింది.

  • Mar 01, 2022, 18:05 PM IST
1 /5

ఆంటోనోవ్​ ఏఎన్​-225 అత్యంత భారీ సైజులో ఉండే విమానం. ఇది కార్గో అవసరాలు మాత్రమే వాడుతారు. మనుషుల రవాణాకు వాడితే ఇది వేల మందిని ఓకేసారి తీసుకోపోగలదు.

2 /5

ఆంటోనోవ్​ ఏఎన్​-225లో 300 టన్నుల ఇంధనం పడుతుంది. ఒకసారి పూర్తి ఇంధనం నింపుకుంటే.. 18 వేల కిలో మీటర్లు ఆగకుండా ప్రయాణిస్తుంది.

3 /5

విమానం సైజు రెండు ఫుడ్​బాల్​ గ్రౌండ్లంత పొడవు ఉంటుంది. అందుకే ఇది సాధారణ విమానాశ్రయాల్లో ల్యాండ్​ అవదు. మన దేశంలో కేవలం ఒకే ఒక్క సారి (2016లో) అది కూడా హైదరాబాద్​లో ఈ విమానం ల్యాండ్ కావడం విశేషం.

4 /5

సాధారణ విమానాలకైతే రెండు, కార్గో విమాననలకైతే 4 ఇంజిన్లు ఉంటాయి. కానీ.. ఆంటోనోవ్​ ఏఎన్​-225లో ఆరు భారీ సైజున్నఇంజిన్లు ఉంటాయి. 

5 /5

ఈ విమాన ఒకే సారి 640 టన్నుల కర్గోను మోసుకుపోగల సామర్థ్యం దీని సొంతం. ఈ విమానాన్ని మ్రియా అని కూడా పిలుస్తుంటారు.