Hair Tips: మీ జుట్టు తాటిచెట్టులా పొడుగ్గా పెరగాలంటే..ఈ ఒక్క నూనె తలకు రాస్తే చాలు

How to Make Onion Oil Naturally: ఉల్లిపాయలేని కూరను ఊహించుకోలేము. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనే సామేత మీకు తెలిసే ఉంటుంది. ఉల్లిపాయతో ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాదు..జుట్టుకు కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఉల్లిపాయను జట్టుకు ఇలా ఉపయోగిస్తే కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దాం. 
 

1 /7

How to Make Onion Oil Naturally: నేటికాలంలో చాలా మంది పనిఒత్తిడి, కాలుష్యం, జీవనశైలిలో మార్పులు వల్ల చిన్న వయస్సులోనే జట్టు సమస్యలతో బాధపడుతున్నారు. జట్టు సమస్యలను దూరం చేసుకునేందుకు మార్కెట్లో లభించే పరలు రకాల హెయిర్ కేర్ ఉత్పత్తులు, నూనెలను కొనుగోలు చేస్తుంటారు. అయితే ఎన్ని షాంపూలు మార్చినా..ఎన్ని హెయిర్ ఆయిల్స్ వాడిని కొందరికి జుట్టు రాలడం మాత్రం అస్సలు తగ్గదు.

2 /7

అంతేకాదు చుండ్రు, చిట్లడం వంటి సమస్యలు కూడా తగ్గవు. దీంతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. అయితే ఇలాంటి సమస్యతో బాధపడేవారు సహజ సిద్ధంగా ఇంట్లోనే తయారు చేసిన ఉల్లిపాయ నూనెను వాడితే ప్రయోజనం చాలా ఉంటుంది. మరి ఉల్లిపాయ నూనెను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.

3 /7

కావాల్సిన పదార్థాలు: కొబ్బరి నూనె -అరకప్పు, కరివేపాకు 20 రెబ్బలు, మెంతులు 1టేబుల్ స్పూన్, ఉల్లిపాయ 1 మీడియం సైజ్   

4 /7

తయారీ విధానం: ముందుగా మీడియం సైజ్ ఉల్లిపాయను తీసుకుని పొట్టు తీసి సన్నగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టౌ ఆన్ చేసి ఓ మందపాటి పాత్ర పెట్టి అందులో పైన చెప్పిన విధంగా కొబ్బరినూనె, మెంతులు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి.   

5 /7

బాగా కలిపిన తర్వాత ఈ మిశ్రమాన్ని మీడియం మంట సుమారు అరగంటపాటు మరగించాలి. ఇలా చేయడం వల్ల ఉల్లి, మెంతులు, కరివేపాకులో ఉన్న పోషకాలన్నీ నూనెలోకి వెళ్తాయి.

6 /7

నూనె మరిగిన అనంతరం స్టౌ ఆఫ్ చేసి మిశ్రమాన్ని చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఒక శుభ్రమైన క్లాత్ సహాయంతో ఆ నూనెను వడకట్టుకోవాలి. తర్వాత దాన్ని ఒక గాలి చొరబడని డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. కావాల్సినప్పుడు ఉపయోగించుకోవచ్చు.   

7 /7

2014లో ఇంటర్నెషనల్ జర్నల్ ఆఫ్ డెర్మటాలజీలో ప్రచురితమైన నివేదిక ప్రకారం..ఉల్లి నూనె జుట్టుకు కుదుళ్లకు రక్తప్రసరణను పెంచుతుందని పేర్కొంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుందని తెలిపింది.