KTR: గులాబీ దళపతి రీఎంట్రీ ఇచ్చేది అప్పుడే.. పండగ వేళ రాజకీయాల్లో కాక రేపుతున్న కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు..

kcr reentry in politics: బీఆర్ఎస్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ఆస్క్ కేటీఆర్ కార్యక్రమంలో నెటిజన్ లతో సరదాగా చిట్ చాట్ చేశారు. ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ సంచలనంగా మారాయి.
 

1 /6

తెలంగాణలో కొన్నిరోజులుగా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ వార్ నడుస్తొందని చెప్పుకొవచ్చు. అమలుకు సాధ్యం కానీ 420 హమీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసిందని బీఆర్ఎస్ కాంగ్రెస్ ను ఏకీ పారేస్తుంది. మరోవైపు కాంగ్రెస్ రివర్స్ లో గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాల వల్లే తెలంగాణ వెనక్కు వెళ్లిందని కూడా ఆరోపణలు చేస్తుంది.

2 /6

ఇదిలా ఉండగా.. ఇటీవల తెలంగాణ రాజకీయాల్లో మాత్రం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ లా మారిందని చెప్పుకొవచ్చు. ఈ నేపథ్యంలో ఇటీవల జాన్వాడ ఘటన కూడా తెలంగాణ రాజకీయాల్లో వివాదస్పదంగా మారింది. దీనిలో కేటీఆర్ బావమరిది అడ్డంగా దొరికిపోయాడని కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తుంది.

3 /6

ఈ నేపథ్యంలో తాజాగా, కేటీఆర్ ఎక్స్ వేదికగా ఆస్క్ కేటీఆర్ అనే కార్యక్రమంలో నెటిజన్ లతో చిట్ చాట్ చేశారు. ఈ క్రమంలో కొందరు నెటిజన్ లు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం సైతం ఇచ్చారు. ఇదిలా ఉండగా.. మాజీ సీఎం కేసీఆర్ కొన్ని నెలలుగా యాక్టివ్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారని, ఆయన మళ్లీ ఎప్పుడు వస్తారని కూడా నెటిజన్ ప్రశ్నించాడు.

4 /6

దీనికి కేటీఆర్ వచ్చే ఏడాది గులాబీ దళపతి మళ్లీ యాక్టివ్ రాజకీయాల్లో వస్తారని క్లారిటీ ఇచ్చారు. అంతే కాకుండా.. 420 హమీలు ఇచ్చిన కాంగ్రెస్  మెడలు వంచుతామని కూడా కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తాన రాజకీయ జీవితంలో ఇలాంటి దిగజారుడు రాజకీయాల్ని తాను ఎప్పుడు కూడా చూడలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

5 /6

తెలంగాణలో ప్రస్తుతం రాజకీయ నాయకులనే కాకుండా.. వారి  బంధువులనుకూడా వేధింపులకు గురిచేసేలా దిగజారుడు రాజకీయాల్ని చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. అయితే.. కేసీఆర్ గతంలో అసెంబ్లీ సమావేశాలకు కూడా దూరంగా ఉన్నారు.  దీంతో కాంగ్రెస్ నేతలు ఇక కేసీఆర్ పనైపోయిందని కూడా పలు మార్లు ఆరోపణలు చేశారు.  

6 /6

ఈ క్రమంలో కేటీఆర్ తాజాగా చేసిన ప్రకటనతో మళ్లీ తెలంగాణలో దీపావళి వేళ రాజకీయాలు పీక్స్ కు చేరాయని చెప్పుకొవచ్చు. మరోవైపు బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణల్ని మాత్రం అదే విధంగా తిప్పికొడుతున్నారు. మళ్లీ తాము ఉద్యమ స్పూర్తితో ముందుకు వెళ్లి.. బీఆర్ఎస్ అధికారంలోకి రావడమే టార్గెట్ గా ముందుకు వెళ్తున్నట్లు కూడా కేటీఆర్ స్పష్టం చేశారు.

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x