Baba Vanga Predictions: బుల్గేరియాకు చెందిన అంధ భవిష్యవక్త బాబా వంగా, 2025 సంవత్సరానికి సంబంధించి కొన్ని షాకింగ్ భవిష్యవాణులు చేయగా, వాటి గురించి ప్రజలు తీవ్ర స్థాయిలో చర్చిస్తున్నారు. ఈ భవిష్యవాణుల్లో ప్రపంచాంతం ప్రారంభం, యూరప్‌లో యుద్ధాలు, ఎలియన్లతో మాట్లాడటం, టెలిపతి వంటి సంచలన విషయాలు ఉన్నాయి.
బాబా వంగా అనే బుల్గేరియన్ దివ్యదర్శి చేసిన భవిష్యవాణులు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి. ఆమె 2025లో ముఖ్యమైన సంఘటనలు చోటుచేసుకుంటాయని ముందుగానే ఊహించారు. యూరప్‌లో యుద్ధాలు, ఎలియన్లతో పరిచయం, టెలిపతి, వైద్యరంగంలో సాంకేతిక విజ్ఞానం వంటి అంశాలు ఈ భవిష్యవాణుల్లో ఆమె ప్రస్తావించారు.
బాబా వంగా చెప్పిన దాని ప్రకారం, 2025లో యూరప్‌లో తీవ్రమైన ఘర్షణలు జరగబోతున్నాయి. ఈ యుద్ధాల కారణంగా జనాభా తగ్గిపోతుందని ఆమె చెప్పారు. ఈ ఘర్షణలు యూరప్ రాజ్యంగ వ్యవస్థలపై కూడా ప్రభావం చూపవచ్చట.
వైద్యరంగంలో అనేక ఆశ్చర్యకరమైన మార్పులు రావచ్చని బాబా వంగా చెప్పారు. ల్యాబ్‌లో అవయవాలను సృష్టించడం, క్యాన్సర్, ఇతర రోగాలకు మందులు కనిపెట్టడం వంటి విజయాలు ఈ ఏడాదిలో చోటు చేసుకుంటాయి అని ఆమె భవిష్యవాణిలో చెప్పారు.
2025లో టెలిపతి వాస్తవం అవుతుందని బాబా వంగా చెప్పారు. ఈ టెక్నాలజీ ద్వారా మనస్సుల్లో మాటల్ని నేరుగా కమ్యూనికేట్ చేయగలమని ఆమె ఊహించారు. అంతేకాకుండా, మానవులు ఎలియన్లతో పరిచయాలు ఏర్పరచుకుంటారని కూడా ఆమె చెప్పారు.
కోల్పోయారు. కానీ ఆమె భవిష్యత్‌ను చెప్పగల దివ్యశక్తి కలిగినవారని అందరూ చెప్తారు. ఇందిరా గాంధీ మరణం గురించి కూడా ఆమె ముందే చెప్పారు. 1996లో ఆమె మరణించినప్పటికీ, ఆమె భవిష్యవాణులు ఇప్పటికీ వైరల్ అవుతూ ఉంటాయి.