Star hero vs Rashmika : ప్రస్తుతం పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకుంది రష్మిక. పుష్ప, యానిమల్ సినిమాలతో ఎంతోమంది హీరోయిన్స్ కన్నా కూడా.. టాప్ పొజిషన్ కి చేరుకుంది. ఈ క్రమంలో ఈ హీరోయిన్ ఒక స్టార్ హీరో దగ్గర అవమానానికి గురైంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందుకు తగిన సాక్షాలను సైతం అభిమానులు షేర్ చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.
రష్మిక మందన్న పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ఒక సాధారణ హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించిన రష్మిక, బ్యాక్ టు బ్యాక్ హిట్లతో నేషనల్ క్రష్‌గా మారారు. తెలుగు, కన్నడ, బాలీవుడ్ వంటి వివిధ భాషల్లో నటిస్తూ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.
కన్నడ చిత్రమైన కిరిక్ పార్టీతో రష్మిక తన సినీరంగ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఈ సినిమా సమయంలోనే సహనటుడు రక్షిత్ శెట్టితో ప్రేమలో పడి, నిశ్చితార్థం చేసుకున్నారు. కానీ, తెలుగు నుంచి భారీ అవకాశాలు రావడం వల్ల నిశ్చితార్థాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది.
ఇక ఆ తర్వాత తెలుగు సినిమాలతో యమ బిజీ అయిపోయింది ఈ హీరోయిన్. ఇక అప్పుడే తాను నిశ్చితార్థం చేసుకున్న రక్షిత్ కు కూడా బ్రేకప్ చెప్పింది. ఆ తరువాత జరిగిన కొన్ని పరిణామాలు.. కన్నడ సినీ పరిశ్రమలో రష్మిక పైన.. కొంత వివాదాన్ని తెచ్చి పెట్టాయి.
తాజాగా, కిరిక్ పార్టీ విడుదలై ఎనిమిదేళ్లు పూర్తైన సందర్భంగా దర్శకుడు రిషభ్ శెట్టి అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రష్మిక పేరును ఎక్కడా ప్రస్తావించకపోవడం సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. పైగా, ఈ సినిమా పోస్టర్‌లో కూడా రష్మిక చిత్రాన్ని తొలగించడం వివాదాస్పదమైంది.
తెలుగు చిత్రసీమలో రష్మిక నటించిన చలో, గీతా గోవిందం, భీష్మ, సరిలేరు నీకెవ్వరు సినిమాలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చాయి. ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో మరోసారి తన నటనతో ఆకట్టుకుంటున్నారు. బాలీవుడ్‌లో కూడా యానిమల్, సికిందర్, థమ వంటి చిత్రాలతో రష్మిక కెరీర్ జెట్ స్పీడ్‌లో ముందుకు సాగుతోంది.
ఈ క్రమంలో కాంతారా హీరో రిషబ్ ఇలా రష్మికను తీసేసి ఫోటో షేర్ చేసి విషెస్ చెప్పనా ప్రస్తుతం.. ఆమె అభిమానులను ఎంతగానో నొప్పిస్తోంది. ఇలా తమ అభిమాన హీరోయిన్ అవమానించడం తగదు అని వాళ్ళు కామెంట్లు పెడుతున్నారు.