Bajaj IPO : బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓకు భారీ స్పందన..షేర్ల లిస్టింగ్ ఎప్పుడంటే?

Bajaj Housing Finance IPO: ఐపీఓ మార్కెట్లో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ అద్భుతమైన స్పందన అందుకుంది. 2008వ సంవత్సరంలో అనిల్ అంబానీ కంపెనీ రిలయన్స్ పవర్ ఎలాగైతే ఐపీఓ సమయంలో సందడి చేసిందో.. ఇప్పుడు అలాంటి సందడి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపిఓ విషయంలో కనిపిస్తోంది. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ కంపెనీ ఐపీఓ విశేషాలు తెలుసుకుందాం.
 

1 /6

Bajaj Housing Finance IPO: బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపిఓ అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. ఈ మధ్యకాలంలో మార్కెట్లో వచ్చిన ఇతర ఐపిఓలతో పోల్చి చూసినట్లయితే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ బంపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు సాయంత్రం బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ IPO సబ్‌స్క్రిప్షన్ ముగిసింది. మొత్తం రూ. 6,560 కోట్ల  నిధుల సేకరణ లక్ష్యంగా  ప్రైమరీ మార్కెట్లోకి ప్రవేశించిన ఈ IPO బుధవారం సాయంత్రం వరకు 62.96 సార్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది. అటు IPO గ్రే మార్కెట్ లో కూడా  బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపిఓ లిస్టింగ్ సమయంలో  భారీ లాభాలను పొందే అవకాశం ఉందని ముందుగానే సూచిస్తోంది. 

2 /6

ఈ IPO కోసం నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల (NII) నుండి భారీ డిమాండ్ కనిపించింది. రిటైల్ ఇన్వెస్టర్లు దీనిని 6.74 రెట్లు సబ్‌స్క్రయిబ్ చేసుకున్నారు. ఉద్యోగుల వాటా 1.92 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది.బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఇప్పటికే యాంకర్ ఇన్వెస్టర్ల నుండి రూ.1,758 కోట్లు పొందింది.   

3 /6

ఈ ఏడాది ఆగస్టులో రూ.2,830 కోట్ల ప్రీమియర్ ఎనర్జీస్ IPOలో రూ.1.48 లక్షల కోట్ల విలువైన బిడ్‌లు దాఖలయ్యాయి. నవంబర్ 2023లో, టాటా టెక్నాలజీస్ రూ.3,042 కోట్ల IPO కోసం రూ. 1.56 లక్షల కోట్ల విలువైన బిడ్‌లు కూడా అందాయి.   

4 /6

IPOలను ట్రాక్ చేసే వివిధ వెబ్ సైట్ ల ప్రకారం, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ IPO GMP గ్రే మార్కెట్ ప్రైజ్ రూ.70 వద్ద ఉంది. రెండవ రోజు సాయంత్రం నాటికి దాని GMP రూ.65 వద్ద ఉంది. ఐపీఓ ప్రకటించిన వెంటనే రూ.50 ప్రీమియంతో ట్రేడింగ్ ప్రారంభించింది. ఇది లిస్టింగ్‌లో 100 శాతం కంటే ఎక్కువ లాభాలను ఇవ్వగలదని నిపుణులు  భావిస్తున్నారు. ఈ కంపెనీ షేర్ల లిస్టింగ్ సెప్టెంబర్ 16, సోమవారం జరగనుంది.   

5 /6

కాగా బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ IPO ప్రైస్ బ్యాండ్ రూ. 66 నుండి రూ. 70 గా నిర్ణయించగా, ఈ IPOలో కనీస పెట్టుబడి పెట్టడానికి, కనీసం ఒక లాట్ 214 షేర్లను కొనుగోలు చేయాలి. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ IPOలో ఒక లాట్ కొనుగోలు చేయడానికి రిటైల్ పెట్టుబడిదారులు రూ. 14,980 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది.   

6 /6

ఇదిలా ఉంటే, 2008 సంవత్సరంలో అనిల్ అంబానీ కంపెనీ రిలయన్స్ పవర్ ఐపీవో అందుకున్న లిస్టింగ్ రెస్పాన్స్ ఇప్పుడు కనిపిస్తోంది. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ విషయంలో కూడా అద్భుతమైన స్పందన కనిపించిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే గతంలో డి మార్ట్ ఐపీవో, ఎల్ఐసి ఐపిఓ విషయంలో కూడా మార్కెట్లో ఇదేవిధంగా సందడి నెలకొంది.