Cars Offers: కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ఇదిగో.. ఈ కార్లపై ఏకంగా రూ. 2 లక్షల దాకా డిస్కౌంట్

 Tata Motors Price Cut: భారత్ లో కార్ల మార్కెట్ జోరు తగ్గింది. ప్యాసింజర్ వెహికల్స్ విక్రయాలు నెమ్మదిగా సాగుతున్నాయి. వచ్చేది  పండగల సీజన్ కావడంతో ప్రముఖ కార్ల తయారీదారు సంస్థలు స్పెషల్ డిస్కౌంట్ ప్రకటిస్తున్నాయి. ఫెస్టివల్ ఆఫ్ కార్స్ పేరుతో అందుబాటులో ఉండే ఈ ఆఫర్లు రానున్న రెండు నెలల్లో అమ్మకాలను పెంచాలన్న లక్ష్యంతో అందుబాటులోకి తీసుకువచ్చినట్లు మార్కెట్ నిపుణఉలు అంటున్నారు. ముఖ్యంగా ఈ పండగల సీజన్లో టాటా తన ఐసీఈ మోడల్స్ పై రూ. 2.5 లక్షల వరకు డిస్కౌంట్ ప్రకటించింది. 
 

1 /6

దసరా, దీపావళికి కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నవారికి గుడ్ న్యూస్. దిగ్గజ కార్ల తయారీదారు కంపెనీలు..తమ మోడల్స్ పై ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. ఇప్పటికే ఉన్న ఇన్వెంటరీని ముంగించేందుకు..ఇన్ పుట్ కాస్ట్స్ తగ్గుతున్నాయి. 

2 /6

 వినియోగదారులను ఆకట్టుకునేందుకు ధరల తగ్గింపుపై ప్రకటనలు చేస్తున్నాయి. గత కొన్నాళ్లుగా ఈ ముడిసరుకులకు వ్యయాలు పెరగడంతో పలు మార్లు ఆయా కంపెనీలు ధరలు పెంచాయి. ఇప్పుడు మాత్రం తగ్గించడం గమనార్హం.  

3 /6

ఇక దేశంలోనే అతిపెద్ద కార్ల దారు కంపెనీ అయిన మారుతీ సుజుకీ తన చిన్న కారు మోడళ్లపై వేలకు వేలు తగ్గించిన విషయం తెలిసిందే. ఇప్పుడు టాటా మోటార్స్ కూడా మారుతీ సుజుకీకి పోటీ ఇస్తున్న టాటా మోటార్స్ కూడా కీలక ప్రకటన వెలువరించింది. 

4 /6

పండగ ఆఫర్ క్యాంపెయినర్ లో భాగంగా తన కార్ల మోడల్స్ పై ధరలను భారీగా తగ్గించింది. ఈ ఆఫర్ అక్టోబర్ 31 వరకు ఉంటుందని పేర్కొంది. టాటా టియాగో పై రూ. 65వేలు, టాటా పంచ్ మోడల్పై 1.20లక్షలు, టాటా నెక్సాన్ రూ. 3 లక్షల వరకు తగ్గించినట్లు సమాచారం. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ.45,000 ఆదా చేసుకోవచ్చు.

5 /6

ఇక ధరలను భారీగా తగ్గించడంతో ఇప్పుడు టాటా పంచ్ ఈవీ స్టార్టింగ్ ధర రూ. 7.99లక్షలుగా ఉంది. నెక్సాన్ ఈవీ రూ. 12.49 లక్షల ప్రారంభ ధరతో ఉంది. టాటా వినియోగదారులు తమ ఛార్జింగ్ పాయింట్ల వద్ద 6 నెలల వరకు ఫ్రీ ఛార్జింగ్ అవకాశం ఉంటుంది. ఇక టాటా టియాగో మోడల్స్ పై టాటా మోటార్స్ ఏకంగా రూ. 65వేల వరకు డిస్కౌంట్ ప్రకటించింది. దీంతో ఇప్పుడు హైదరాబాద్ సహా దేశంలోని పలు నగరాల్లో టాటా టియాగో ఆన్ రోడ్డు ధర రూ. 4,99,990గా ఉంది. అంటే ఈ కారు ధర రూ. 5లక్షల లూపే ఉంది. 

6 /6

ఇతర మోడల్స్ విషయానికి వస్తే టాటా టిగోర్ మోడల్స్ పై రూ. 30వేలు తగ్గించింది. ప్రస్తుతం స్టార్టింగ్ ధర రూ. 5,99,900గా ఉంది. టాటా ఆల్ట్రోజ్ పై 45వేలు తగ్గింది. ప్రస్తుతం రూ. 6, 49, 900తో ప్రారంభం అవుతుంది. టాటా హ్యారియర్ పై రూ. 1.60 లక్షల వరకు తగ్గింది. ఇప్పుడు రూ. 14, 99, 000 వద్ద ఉంది. టాటా సఫారీపై రూ. 1.80 లక్షల వరకు డిస్కౌంట్ ప్రకటించింది. దీని ప్రారంభం ధర రూ. 15, 49, 000గా ఉంది.