Bathukamma 2024: 8వ రోజు వెన్నముద్దల బతుకమ్మ.. నైవేద్యం ఏం పెడతారు తెలుసా?

1 /5

బతుకమ్మ అక్టోబరు 3వ తేదీ ప్రారంభమైంది. అక్టోబర్‌ 9వ తేదీ ఎనిమిదవ రోజు బతుకమ్మను తయారు చేస్తారు. ఈ రోజు వెన్నముద్దల బతుకమ్మ అని పిలుస్తారు. ముందురోజు 7వ రోజు వేపకాయల బతుకమ్మ అంటారు.  

2 /5

బతుకమ్మ పండుగ ప్రతి ఏడాది పెత్తర అమావాస్య రోజు ప్రారంభమవుతుంది. 9 రోజులపాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈరోజు పిల్లాపాలు, పెద్దలు అంతా కలిసి బతుకమ్మను తెలంగాణవ్యాప్తంగా నిర్వహిస్తారు.  

3 /5

ముఖ్యంగా ఈ బతుకమ్మలో బంతి, గునుగు, తంగేడు ఎంతో ప్రత్యేకం. ఈ పూలలో ఔషధ గుణాలు కూడా పుష్కలం. రకరకాల పూలతో బతుకమ్మను పేర్చి అందులో గౌరమ్మను కూడా పెడతారు.  

4 /5

తెలంగాణ రాష్ట్ర పండుగగా బతుకమ్మకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ 9 రోజులపాటు అంగరంగ వైభవంగా బతుకమ్మను నిర్వహిస్తారు. సాయంత్రం సమయంతో బతుకమ్మను తయారు చేసి ఇళ్ల ముందు ఆడుకుంటారు  

5 /5

ఎనిమిదవ రోజు తయారు చేసే బతుకమ్మకు ప్రసాదంగా వెన్నముద్ద, నువ్వులు, బెల్లం నైవేద్యంగా పెడతారు. ఆడిపాడిన తర్వాత బతుకమ్మను నిమజ్జనం చేస్తారు. వాయినం ఇచ్చి పుచ్చుకుంటారు. ఈసారి సద్దుల బతుకమ్మ అక్టోబర్‌ 10వ తేదీ నిర్వహించనున్నారు.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)