Sridevi Pregnancy: దక్షిణాదితోపాటు బాలీవుడ్‌ను ఏలిన హీరోయిన్ శ్రీదేవి. ఆమె ఈ లోకాన్ని వీడి వెళ్లినా ప్రేక్షకుల్లో మాత్రం ఆమె రూపం చెరిగిపోదు. అలాంటి నటికి సంబంధించి ఓ సంచలన వార్త బయటకు పొక్కింది. శ్రీదేవి పెళ్లికి ముందే గర్భం దాల్చిందనే వార్త కలకలం రేపింది. ఆమె ఒకరితో ప్రేమలో ఉన్నారని.. అది విఫలమై బోనీకపూర్‌ను వివాహమాడిందనే తదితర సంచలన విషయాలు తెలుసుకోండి.
Sridevi: పెళ్లికి ముందే గర్భం దాల్చిన స్టార్ హీరోయిన్ శ్రీదేవి.. ఆ హీరోనే కారణం?
పాత తరం.. కొత్త తరాన్ని రెండు తారలను తన నటన.. అందంతో రంజింపజేసిన హీరోయిన్ శ్రీదేవి.
అన్ని భాషల్లో: తెలుగుతోపాటు హిందీతో సహా అన్ని దక్షిణాది భాషల్లో నటించిన స్టార్ హీరోయిన్ శ్రీదేవి.
దేవకన్యే: దివి నుంచి వచ్చిన దేవకన్య అనే రీతిలో అందంతో అందరినీ కట్టిపడేసిన శ్రీదేవి జీవితంలో కొన్ని సంచలన విషయాలు ఉన్నాయని సమాచారం.
స్టార్ హీరోతో పెళ్లి: బోనీకపూర్ కంటే ముందే నటి శ్రీదేవి ఒకరిని ఇష్టపడ్డారని సమాచారం. తన కుమార్తెను ఓ స్టార్ హీరోకు ఇచ్చి వివాహం చేయాలని శ్రీదేవి తల్లి ప్రయత్నాలు చేసింది.
అందరూ హీరోలతో: అన్ని పరిశ్రమల్లోని అగ్ర నటులతో శ్రీదేవి నటించిన విషయం తెలిసిందే. బాల నటిగా మొదలుకుని హీరోయిన్గా శ్రీదేవి రాణించారు.
సూపర్ స్టార్‌తో లవ్: నటిస్తున్న క్రమంలోనే సూపర్ స్టార్ రజనీకాంత్‌తో శ్రీదేవి ప్రేమలో పడ్డారని సమాచారం. వారిద్దరూ కలిసి ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు చేశారు. రజనీకాంత్ ఆరోగ్యం బాగా లేకపోవడంతో శ్రీదేవి అతడి కోసం వారం రోజులు ఉపవాసం కూడా ఉన్నారు.
జోడీ సంచలనం: రజనీకాంత్, శ్రీదేవి జోడీ పరిశ్రమలో మంచి జోడీగా గుర్తింపు పొందింది. వారిద్దరూ పెళ్లి చేసుకున్నారనే వార్త అప్పట్లో సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించింది.
కుదరక అతడితో: చివరికి రజనీకాంత్‌తో పెళ్లి కుదరకపోవడంతో శ్రీదేవి.. ముంబైలో స్థిరపడిన అగ్ర నిర్మాత బోనీ కపూర్‌తో ప్రేమలో పడింది.
పెళ్లికి ముందే గర్భం: అప్పటికే బోనీకపూర్‌కు పెళ్లయి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. బోనీతో ప్రేమలో ఉన్న సమయంలోనే శ్రీదేవి గర్భం దాల్చారని పరిశ్రమలో ఉన్న టాక్. గర్భం దాల్చడంతో బోనీ కపూర్ శ్రీదేవిని వివాహం చేసుకున్నారు. శ్రీదేవికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారనే విషయం తెలిసిందే.