Belly Fat Remedies: గంటల కొద్దీ వ్యాయామం వద్దు, ఈ 5 గ్రీన్ జ్యూస్‌లతో బెల్లీ ఫ్యాట్ మాయం

Belly Fat Remedies: గత కొద్దికాలంగా బెల్లీ ఫ్యాట్ సమస్య అధికంగా కన్పిస్తోంది. వయస్సుతో సంబంధం లేకుండా అందరికీలో ఈ సమస్య ఉంటోంది. అంటే కడుపు చుట్టూ కొవ్వు పేరుకుపోయి నలుగురిలో అసౌకర్యంగా ఉంటుంది. బెల్లీ ఫ్యాట్ తగ్గించడం ఓ సవాలుగా మారిపోయింది అందరికీ. 

అయితే కొన్ని ఆకు కూరల జ్యూస్ ద్వారా బెల్లీ ఫ్యాట్ చాలా వేగంగా కరిగించవచ్చని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆకు కూరల్లో ఉండే ఫైబర్, విటమిన్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు బెల్లీ ఫ్యాట్ దూరం చేయడంలో అద్భుతంగా ఉపయోగపడతాయి. దీనికోసం క్రమం తప్పకుండా 5 రకాల వెజిటబుల జ్యూస్ తీసుకోవాలి

1 /5

కీరా జ్యూస్ ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు కేలరీలు తక్కువ. ఇది శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. ఇందులో కొద్దిగా నిమ్మరసం, పుదీనా ఆకులు కలుపుకుని సేవిస్తే మంచి ఫలితాలుంటాయి. శరీరం డీటాక్స్ అవుతుంది. త్వరగా బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది

2 /5

కాకరకాయ జ్యూస్ కాకరకాయ జ్యూస్‌లో ఉండే కొన్ని ప్రత్యేకమైన పోషకాలు బెల్లీ ఫ్యాట్ తగ్గించేందుకు ఉపయోగపడతాయి. ఇందులో కొద్దిగా నిమ్మరసం తేనె కలుపుకుని సేవించాలి

3 /5

కాలిఫ్లవర్ జ్యూస్ కాలిఫ్లవర్‌లో ఫైబర్, విటమిన్ సి పెద్దమొత్తంలో ఉంటాయి. ఇవి కడుపు చుట్టూ పేరుకున్న ఫ్యాట్ కరిగించేందుకు దోహదం చేస్తాయి. కాలిఫ్లవర్ జ్యూస్‌లో కొద్దిగా నిమ్మరసం పిండుకుని తాగితే రుచి బాగుంటుంది

4 /5

పాలకూర జ్యూస్ పాలకూరలో ఫైబర్, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి బెల్లీ ఫ్యాట్ తగ్గించేందుకు దోహదం చేస్తాయి. పాలకూర జ్యూస్‌లో కొద్దిగా నిమ్మరసం, తేనె కలుపుకుని తాగితే మంచి ఫలితాలు ఉంటాయి.

5 /5

కొత్తీమీర జ్యూస్ కొత్తీమీరలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరం నుంచి విష పదార్ధాలను బయటకు పంపించడంలో కీలకపాత్ర వహిస్తాయి. అంతేకాకుండా మెటబోలిజం వేగవంతం అవుతుంది. దాంతో బరువు వేగంగా తగ్గుతారు. బెల్లీ ఫ్యాట్ సమస్య నుంచి విముక్తి పొందుతారు.