Anti Ageing Foods: ముఖంపై ముడతలు తొలగించే బెస్ట్ 5 ఫుడ్స్

సాధారణంగా నిర్ణీత వయస్సు దాటితే వృద్ధాప్యం అనేది సహజమే. కానీ ఇటీవలి కాలంలో తక్కువ వయస్సుకే ఈ సమస్య తలెత్తుతోంది. చాలామంది దీర్ఘకాలం యౌవనంగా ఉండాలని అనుకుంటారు. బిజీ లైఫ్, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ముఖంపై ముడతలు వచ్చేస్తున్నాయి. అయితే డైట్‌లో ఈ పదార్ధాలుంటే ఏజీయింగ్ సమస్యను అధిగమించవచ్చు.

Anti Ageing Foods: సాధారణంగా నిర్ణీత వయస్సు దాటితే వృద్ధాప్యం అనేది సహజమే. కానీ ఇటీవలి కాలంలో తక్కువ వయస్సుకే ఈ సమస్య తలెత్తుతోంది. చాలామంది దీర్ఘకాలం యౌవనంగా ఉండాలని అనుకుంటారు. బిజీ లైఫ్, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ముఖంపై ముడతలు వచ్చేస్తున్నాయి. అయితే డైట్‌లో ఈ పదార్ధాలుంటే ఏజీయింగ్ సమస్యను అధిగమించవచ్చు.
 

1 /5

పాలకూర ఆకు కూరలు, ఆకుపచ్చని కూరగాయలు ఆరోగ్యానికి చాలా మంచివి. ఇందులో ఉండే విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కే, మెగ్నీషియం, ఐరన్ వంటి పోషకాలు పెద్దఎత్తున ఉంటాయి. పాలకూర తినడం వల్ల చర్మం హైడ్రేట్‌గా ఉంటుంది. ముఖంపై ముడతలు తొలగిపోతాయి. 

2 /5

అవకాడో అవకాడో సూపర్ ఫుడ్ అని చెప్పవచ్చు. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కే, పొటాషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. నిర్జీవంగా ఉండే చర్మంపై తిరిగి నిగారింపు వస్తుంది. అవకాడో తినడం వల్ల చర్మంపై డెడ్ సెల్స్ తగ్గుతాయి. 

3 /5

పప్పులు పప్పులు తినడం వల్ల శరీరానికి చాలా లాభాలున్నాయి. పప్పులు క్రమం తప్పకుండా తినడం వల్ల ముఖంపై నిగారింపు తిరిగొస్తుంది. ఇందులో ఉండే ప్రోటీన్లు, మినరల్స్, ఫైటో న్యూట్రియంట్లు, విటమిన్లు, ఫైబర్  కీలకంగా ఉపయోగపడతాయి. వీటివల్ల చర్మ కణాలు ఆరోగ్యంగా ఉంటాయి. ముఖంపై మచ్చలు పోతాయి.

4 /5

బొప్పాయి బొప్పాయి బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్. ఇందులో మినరల్స్ పెద్దఎత్తున ఉంటాయి. బొప్పాయి తినడం వల్ల ముఖంపై ముడతలు, గీతలు తొలగిపోతాయి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ రూపంలో తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి.

5 /5

ముడతలు దూరం చేసే ఫుడ్స్ ముఖాన్ని అందంగా సంరక్షించుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దీనికోసం డైట్ మార్చాల్సి ఉంటుంది. యాంటీ ఏజీయింగ్ ఫుడ్స్ తినడం వల్ల  ముఖంపై ముడతలు మాయమౌతాయి. చర్మానికి నిగారింపు వస్తుంది.