Best CNG Cars: తక్కువ ధర, ఎక్కువ మైలేజ్ ఇచ్చే టాప్ 5 సీఎన్జీ కార్లు ఇవే

దేశంలో పెట్రోల్-డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ క్రమంలో  పెట్రోల్ , డీజిల్ కార్లకు ప్రత్యామ్నాయంగా సీఎన్జీ కార్లు కన్పిస్తున్నాయి. సీఎన్జీ కారు కొనుగోలు చేయాలని అనుకుంటుంటే మాత్రం...మీ కోసం టాప్ 5 బెస్ట్ సీఎన్జీ కార్ల జాబితా అందిస్తున్నాం..ధర కూడా తక్కువే..మైలేజ్ అధికం.

Best CNG Cars: దేశంలో పెట్రోల్-డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ క్రమంలో  పెట్రోల్ , డీజిల్ కార్లకు ప్రత్యామ్నాయంగా సీఎన్జీ కార్లు కన్పిస్తున్నాయి. సీఎన్జీ కారు కొనుగోలు చేయాలని అనుకుంటుంటే మాత్రం...మీ కోసం టాప్ 5 బెస్ట్ సీఎన్జీ కార్ల జాబితా అందిస్తున్నాం..ధర కూడా తక్కువే..మైలేజ్ అధికం.
 

1 /5

మారుతి సుజుకీ కంపెనీకు చెందిన మరో మోడల్ వేగన్ ఆర్. చాలా పాపులర్ వెర్షన్ ఇది. వేగన్ ఆర్ సీఎన్జీ వెర్షన్ కిలోకు 32.52 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందట. వేగన్ ఆర్ ధర 4.93 లక్షలుగా ఉంది

2 /5

మారుతి సుజుకీ 2022 జనవరిలో సిలేరియో కారు ఎస్ సీఎన్జీ మోడల్ ప్రవేశపెట్టింది. ఢిల్లీలో ఎక్స్ షోరూమ్ ధర 6.58 లక్షలుంది. ఇందులో 10 లీటర్ ఇంజన్ ఉంది. కిలో సీఎన్జీతో 35.60 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.

3 /5

మారుతి సుజుకీకి చెందిన ఆల్టో సీఎన్జీ కిట్‌తో వస్తోంది. ఆల్టో సీఎన్జీ వెర్షన్ కిలో సీఎన్జీకు 31.59 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఆల్టో ప్రారంభధర 3 లక్షల నుంచి ఉంది.

4 /5

ఇక హ్యూండయ్ కంపెనీ సెంట్రో మోడల్ సీఎన్జీ వేరియంట్ ధర 5 లక్షల 99 వేలుగా ఉంది. ఇది కిలో సీఎన్జీకు 29 లీటర్ల మైలేజ్ ఆఫర్ చేస్తోంది.

5 /5

హ్యుండయ్‌కు చెందిన ప్రముఖ మోడల్ గ్రాండ్ ఐ 10 కూడా సీఎన్జీ వెర్షన్ వచ్చేసింది. కిలో సీఎన్జీ 25 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. దీని ధర 6.99 లక్షల నుంచి ప్రారంభం కానుంది. ఇది 5 సీటర్ హ్యాచ్‌బ్యాక్ కారు.