Skin Care: నిత్య యవ్వనంగా కనపడాలంటే ఇవి తినండి

ప్రస్తుతం ఉన్న గాలిలో కాలుష్యం, కృత్రిమ ఆహార పదార్థాల వలన చర్మం త్వరగా నిర్జీవంగా మారి చర్మంపై ముడతలు పడి.. వృద్దులుగా కనపడుతుంటాము. కానీ ఈ ఆహార పదార్థాలను తింటే వృద్ధాప్య ముడతలు తొలగిపోతాయి.. 

  • Nov 02, 2021, 19:19 PM IST

చర్మం పై కలిగే ముడతలను తొలగించుకోవాలంటే.. రసాయనిక క్రీములను ఇతర వాటిని కాకుండా ఈ ఆహార పదార్థాలను తింటే చాలు.. చర్మం సమస్యలకు దూరంగా ఉండవచ్చు 

1 /5

నిరంతరం దొరికే అతి ముఖ్యమైన పండ్లలో ఆపిల్ ఒకటి. ఆపిల్ లో పెక్టిన్ అనే పోషక పదార్ధం ఉండడం వలన శరీరంలో ఉండే విష పదార్థాలు తొలగిపోతాయి. శరీరంలో ఎలాంటి విష పదార్థం లేకపోవడం వలన చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. డేవిడ్ వోల్ఫే, పోషక నిపుణుడు, ప్రకారం విటమిన్ సి వలన చర్మ కణాలు పెరిగి, చర్మం కాంతివంతంగా అవుతుంది మరియు వెంట్రుకలు, గోర్లు బలపడతాయి. ఆపిల్ లో ఉండే విటమిన్ బి (ముఖ్యంగా బి9 మరియు బి5) చర్మ సమస్యల నుంచి విముక్తిని కలిగిస్తుందని తెలిపారు. Represented Image 

2 /5

కొబ్బరి నూనెలో ఉండే వివిధ పోషక పదార్థాలు కణ నిర్మాణానికి ఉపయోగపడతాయి. దాని వలన చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. కొబ్బరి నూనెను నేరుగా చర్మం పైన వాడినట్లయితే చర్మం పై పగుళ్ళు రాకుండ సహాయపడుతుంది మరియు చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంటుంది. Represented Image 

3 /5

వీటిలో చాలా రకాల విటమిన్లు, ఖనిజాలు మరియు అనామ్లజనకాలు ఉంటాయి. ఇవి జీర్ణ శక్తిని పెంపొందించి, పరోక్షంగా చర్మ ఆరోగ్యానికి దోహదపడుతుంది.  శాస్త్రవేత్తల వివిధ పరిశోధనల ప్రకారం పప్పులలో చాలా పోషక విలువలు మరియు విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటాయి. ఇవి చర్మ సౌందర్యానికి దోహదపడతాయి. Represented Image 

4 /5

స్ట్రాబెర్రీలో ఎక్కువ శాతం విటమిన్ సి ఉండడం వలన త్వరగా వృద్ధాప్యం రాకుండా కాపాడుతుంది. శరీరంలో ఉన్న విష పదార్థాల్ని కూడా నిర్మూలిస్తుంది. స్ట్రాబెర్రీలో విటమిన్ సి తో పాటు విటమిన్ ఎ మరియు ఇ కూడా ఉంటాయి. ఇది ప్రతిక్షకారినిగా పని చేస్తుంది. అందువలన చర్మం ఆరోగ్యంగా, యౌవ్వనంగా ఉంటుంది. Represented Image 

5 /5

జామకాయల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణ శక్తిని పెంచుతుంది. ఇవి శరీరంలోని విష పదార్థాలు తొలగించడం వలన చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. జిస్ట్ అనే శాస్త్రవేత్త ప్రకారం జామకాయల్లో విటమిన్ సి ఉండడం వలన శరీరానికి ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే వివిధ వ్యాధులతో, వైరస్ మరియు బాక్టీరియాలతో పోరాడుతుంది. జామకాయలు తినడం వలన గాయాలు త్వరగా నయమవుతాయి. Represented Image 

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x