Vastu for Car Parking: హిందూ జ్యోతిష్యశాస్త్రంలో వాస్తు శాస్త్రానికి విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. ఇంటి నిర్మాణం, ఇంట్లో వస్తువుల అమరిక, ఏ మొక్కలు ఎక్కడ ఉంచాలనే వివరాలు వాస్తుశాస్త్రంలో వివరంగా ఉన్నాయి. చాలామంది ఈ విషయాల్లో వాస్తుని తప్పకుండా ఆచరిస్తుంటారు.
Vastu for Car Parking: అదే సమయంలో కార్ పార్కింగు అంటే వాహనాల పార్కింగుకు కూడా వాస్తు ఉంటుందనే విషయం చాలామందికి తెలియదు. ఆశ్చర్యపోతున్నారా..ముమ్మాటికీ నిజమిది. ఇంట్లో లేదా ఆఫీసులో కారు, బైక్ వంటివి ఏ దిశలో ఎలా పార్క్ చేస్తే మంచిదో తెలుసుకుందాం..
వాస్తు ప్రకారం వాహనాల పార్కింగ్ సమయంలో ముందు భాగం దక్షిణం వైపు ఉండాలి. లేకపోతే మెయింటెనెన్స్ ఖర్చులు పెరుగుతాయి.
వాస్తు ప్రకారం ఇంటి సౌత్ వెస్ట్ దిశలో పెద్ద వాహనాలు పార్క్ చేయాలి. ఇంటి దక్షిణ పశ్చిమ దిశలో వాహనాలు పార్కింగ్ చేయడం శుభసూచకం.
వాస్తు ప్రకారం ఇంటి నార్త్ ఈస్ట్ దిశలో చిన్న వాహనాలు పార్క్ చేయవచ్చు. ఒకవేళ చోటు లేకుంటే 24 గంటల్లో స్థానం మార్చాల్సి ఉంటుంది.
ఇంటి నార్త్ ఈస్ట్ దిశలో కారు లేదా జీప్ వంటి పెద్ద వాహనాలు పార్కింగ్ చేయడం వల్ల ఆర్ధికంగా సమస్యలు ఎదురుకావచ్చు. మానసిక ఆందోళన కూడా పెరుగుతుంది. వాస్తు ప్రకారం ఇంటి నార్త్ ఈస్ట్ దిశలో పార్కింగ్ వల్ల ఇంటి ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది.
వాస్తు ప్రకారం ఒకవేళ ఉత్తర దిశలో చోటు లేకుంటే దక్షిణ తూర్పు దిశలో పార్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఇంట్లో ఉత్తర తూర్పు దిశలో జీప్ లేదా కారు వంటి పెద్ద వాహనాలు పార్క్ చేయడం మంచిది కాదంటారు.
వాస్తుశాస్త్రం ప్రకారం వాహనాల పార్కింగ్‌కు అత్యుత్తమమైన దిశ ఉత్తరం, పశ్చిమ దిశలు. వాస్తు ప్రకారం తూర్పు, ఉత్తర దిశల్లో చిన్న వాహనాలు పార్కింగ్ చేయవచ్చు. దక్షిణం, పశ్చిమ దిశల్లో పెద్ద వాహనాలు పార్క్ చేయాలి.