Tea Leaves Benefits: టీ ఆకులు కేవలం టీ కోసమే కాకుండా ఆరోగ్యపరంగా చాలా సమస్యలకు చెక్ పెడుతుంది. ఎందుకంటే ఇందులో అద్భుతమైన పోషక విలువలున్నాయి. ముఖ్యంగా సౌందర్య సంరక్షణలో అంటే చర్మ సంరక్షణ, కేశ సంరక్షణలో టీ బ్యాగ్ థెరపీ అద్భుతంగా పనిచేస్తుంది. అలాంటి ఐదు అద్బుతమైన ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
డీటాక్స్ స్నానం చేసే నీటిలో టీ పొడి కలపడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. శరీరాన్ని డీటాక్స్ చేస్తుంది. గ్రీన్ టీ అద్భుతంగా పనిచేస్తుంది.
డేండ్రఫ్ నుంచి విముక్తి కేశాలు రాలకుండా తగ్గిస్తుంది. స్కాల్ప్ హెల్తీగా చేస్తుంది. టీలో యాంటీ ఆక్సిడెంట్లు కేశాలను కుదుళ్లతో సహా పటిష్టం చేస్తుంది.
పింపుల్స్ తొలగింపు ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ముఖంపై ఉండే పింపుల్స్ చాలా సులభంగా తగ్గిస్తాయి. వయస్సు పెరిగే కొద్దీ ముఖంపై పడే ముడతల్ని తగ్గిస్తుంది.
స్ట్రెస్ రిలీఫ్ టీ బ్యాగ్ను డిఫ్యూజర్లో లేదా నీళ్లలో కలిపి వాడాలి. ఇందులో ఉండే పోషకాలు ఒత్తిడిని తగ్గిస్తాయి. మూడ్ స్వింగ్ చేస్తాయి.
డార్క్ సర్కిల్స్ ముఖంపై డార్క్ సర్కిల్స్, స్వెల్లింగ్ సమస్యను తగ్గించేందుకు టీ బ్యాగ్ థెరపీ ఉపయోగపడుతుంది. చల్లటి టీ బ్యాగ్తో కళ్లపై 10-15 నిమిషాలుంచాలి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి.