Big Shock To YS Jagan Ganji Chiranjeevi And YCP MLC Joins In JanaSena Party:అధికారంలో ఉన్న జనసేన పార్టీ రాజకీయంగా బలోపేతం కావడంపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలో ఇతర పార్టీల నాయకులను ఆహ్వానిస్తోంది. ఈ సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్‌కు ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భారీ దెబ్బ కొట్టారు. వైసీపీకి చెందిన ఒక ఎమ్మెల్సీతోపాటు కీలక నాయకుడిని పవన్ చేర్పించుకుని పవర్ పంచ్ వేశారు.
ఎన్నికల అనంతరం జనసేన పార్టీ బలోపేతమవుతోంది. రోజురోజుకు ఆ పార్టీలో నాయకుల చేరిక పెరుగుతోంది.
వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భారీ దెబ్బ కొట్టారు.
వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణను జనసేన పార్టీలోకి పవన్ కల్యాణ్ ఆహ్వానించారు.
అంతే కాకుండా రాజధాని ప్రాంతంలోని మంగళగిరి నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు గంజి చిరంజీవిని పార్టీలో చేర్చుకున్నారు. ఆయన ఆప్కో చైర్మన్‌గా పని చేయడమే కాకుండా వైఎస్సార్‌సీపీ చేనేత విభాగానికి అధ్యక్షులుగా కొనసాగుతున్నారు.
వారిద్దరికీ జనసేన పార్టీ కండువా కప్పి పవన్ కల్యాణ్ సాదరంగా ఆహ్వానించారు. వీరి చేరికతో జనసేన పార్టీ కొంత బలంగా కానుంది.
చేరిన వారికి పదవులపై పార్టీ అధినేత పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది.