Traffic Restrictions: వాహనదారులకు బిగ్‌ అలెర్ట్‌.. ఈ నెల 30వ తేదీ వరకు ఈ రూటులో వెళ్లకండి..

Traffic Restrictions In Hyderabad: హైదరాబాద్‌ వాహనచోదకులకు బిగ్‌ అలెర్ట్ రోడ్డు బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా గచ్చిబౌలీలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఈ రూటు గుండా వెళ్లే వానదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లలని ట్రాఫిక్‌ పోలీసులు కోరారు. మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
 

1 /5

గచ్చిబౌలీలో ట్రాఫిక్ ఆంక్షలు రోడ్‌ ఓవర్‌ బ్రిడ్జి (ROB) నిర్మాణం పనులలో భాగంగా ఈ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వాహనదారులు ముందుగానే మార్గాల ఈ విషయం తెలుసుకుని ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలి లేకపోతే ఇబ్బందులు పడతారు.   

2 /5

సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు శుక్రవారం ట్రాఫిక్‌ ఆంక్షలను విధించారు. రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణంలో భాగంగా ఈ మార్గాల్లో నుంచి వాహన వాహనదారులకు ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టారు. ముఖ్యంగా సైబరాబాద్ నుంచి యశోద హాస్పిటల్ వెళ్లే మార్గాలగుండా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.  

3 /5

 నేటి నుంచి అంటే సెప్టెంబర్ 14 నుంచి 30 వరకు వాహనదారులు సైబర్ టవర్ 100 ఫీట్ జంక్షన్, కొత్తగూడా నుంచి జెఎన్టియు, మూసాపేట్ కి వెళ్లేవారు ఇతర మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టారు.  

4 /5

టడ్డీ కాంపౌండ్ గుండా జేఎన్టీయూ మూసాపేట్ ద్వారా 100 ఫీట్ జంక్షన్ వెళ్లేవారు పర్వత్ నగర్ జంక్షన్ గుండా మళ్లింపులు చేపట్టారు. ఇక ఐకియా సైబర్ గేట్వే, సిఒడి జంక్షన్ గుండా వెళ్లే వాహనాలను జేఎన్టీయూ వయా సైబర్ టవర్ ఫ్లైఓవర్ నుంచి నేరుగా జెఎన్టియు చేరుకోవచ్చు.

5 /5

 సైబర్ టవర్ బ్రిడ్జి కింద నుంచి జేఎన్టీయూ  వెళ్లే వాహన చోదకులు ఎన్ గ్రాండ్ హోటల్ వద్ద డైవర్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. వయా ఎన్‌ కన్వెన్షన్ నుంచి జైన్ ఎంక్లేవ్ వద్ద కుడి వైపు తీసుకుని  యశోద హాస్పిటల్ వెనుక రోడ్డు గుండా జేఎన్టీయూ చేరుకోవచ్చు