Petrol Price Drop Soon: పండుగల వేళ ప్రజలకు తీపి కబురు అందనుంది. భారీగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు త్వరలో తగ్గనున్నాయి. అంతర్జాతీయంగా ముడి సరుకు ధరలు తగ్గడంతో పండుగల ముందు ధరలు తగ్గుతాయని సమాచారం.
భారత్ లో అధికం: పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయంగా ధరలు పడిపోతున్నా దేశంలో మాత్రం నిలకడగా పెరుగుతున్నాయి. ప్రపంచంలోనే అత్యధికంగా భారత్‌లోనే అత్యధిక పెట్రోల్, డీజిల్ ధర ఉంది.
క్షీణిస్తున్న ధరలు: అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు క్షీణిస్తుండడంతో త్వరలో దేశంలో ధరలు తగ్గనున్నాయని సమాచారం.
ముడి చమురు: ఒక బ్యారెల్ చమురు ధర 80 డాలర్ల నుంచి 70 డాలర్లకు పడిపోయింది. అక్కడ ధరలు తగ్గడంతో భారత్‌లో కూడా ధరలు తగ్గనున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి.
పండుగ కానుక: దసరా, దీపావళి ముందు లీటర్‌కు రూ.2 నుంచి రూ.3 చొప్పున పెట్రోల్, డీజిల్ ధర తగ్గుతుందని ప్రచారం జరుగుతోంది.
విశ్లేషకుల అభిప్రాయం: ఐసీఆర్ఏ కార్పొరేట్ రేటింగ్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గిరీశ్ కుమార్ కదమ్ ఇదే విషయాన్ని చెప్పారు. ఈ మేరకు చమురు నిర్వహణ సంస్థలు త్వరలో నిర్ణయం తీసుకుంటారని చూచాయగా చెప్పారు.
నాడు తగ్గుదల: చివరిసారి ఈ ఏడాది మార్చి 15వ తేదీన పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్‌పై రూ.2 తగ్గిన విషయం తెలిసిందే.
అక్కడే ఎక్కువ: కాగా పెట్రోల్, డీజిల్ ధరల విషయానికి వస్తే ప్రతిపక్ష పార్టీల పాలిత రాష్ట్రాల్లో అధికంగా ఉన్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో మాత్రం రూ.వంద లోపు ధరలు ఉండడం గమనార్హం.