Reliance Jio: జియో యూజర్లకు మరో షాక్‌.. ఉచిత నెట్‌ఫ్లిక్స్‌తో రీఛార్జీ ప్లాన్‌ను రూ. 300 పెంచిన జియో..

Reliance Jio Hikes Prepaid Plans: గత రెండు నెలల క్రితమే అన్ని టెలికామ్‌ కంపెనీలు రీఛార్జ్‌ ప్లాన్‌ ధరలను పెంచిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా మరోసారి రిలయన్స్ జియో రీఛార్జీ ప్లాన్‌ ధరలను పెంచేసింది. ఇందులో ఉచితంగా నెట్‌ఫ్లిక్స్‌ను అందిస్తుంది. తాజాగా జియో రీఛార్జీ ప్లాన్స్‌ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
 

1 /5

రిలయన్స్ జియో ఓ రెండు రీఛార్జీ ప్లాన్ల ధరలను పెంచేసింది. ఇందులో కంప్లిమెంటరీగా నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రీప్షన్‌ ఉచితంగా పొందుతారు.  

2 /5

జియో అధికారిక వెబ్‌సైట్‌, మొబైల్‌ యాప్‌ల వివరాల ప్రకారం జియో తన రీఛార్జీ ప్లాన్‌ ధరలను ఏకంగా రూ.200 నుంచి రూ. 300 పెంచేసింది. ఈ ప్లాన్‌లో అదనంగా ఉచిత నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఉచితంగా అందించనుంది. ఆ వివరాలు తెలుసుకుందాం.  

3 /5

రిలయన్స్‌ జియో రూ.1,099 రీఛార్జ్‌ ప్లాన్‌.. మొదట రూ. 1,099 ఉన్న రీఛార్జీ ప్లాన్లు తాజాగా రూ.1,299 కు పెంచింది. ఇందులో మీరు రూ. 149 ఉచిత నెట్‌ఫ్లిక్స్‌ మొబైల్‌ సబ్‌స్క్రీప్షన్‌ పొందుతారు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 84 రోజులు, ప్రతిరోజూ 2 GB డేటా పొందుతారు. ఇందులో అన్‌లిమిటెడ్‌ వాయిస్‌ కాలింగ్‌, ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు పొందుతారు.

4 /5

రిలయన్స్ జియో రూ. 1,499 రీఛార్జీ ప్లాన్‌.. ఈ ప్లాన్‌ ధరను రూ 1,799 కు పెంచేసింది జియో ఇందులో మీరు ఉచితంగా నెట్‌ఫ్లిక్స్‌ బేసిక్‌ సబ్‌స్క్రీప్షన్‌ పొందుతారు. ప్లాన్‌ వ్యాలిడిటీ 84 రోజులు ప్రతిరోజూ 3 GB డేటా కూడా ఉచితంగా పొందుతారు. ఈ ప్రీపెయిడ్‌ ప్లాన్‌లో కూడా ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు పొందుతారు. అన్‌లిమిటెడ్‌ కాలింగ్ సౌకర్యం ఉంటుంది.

5 /5

జులై 3 నుంచి ప్రధాన టెలికాం ఆపరేటర్లు మొబైల్ టారిఫ్‌లను సవరించాయి. ఆ తర్వాత తమ ప్లాన్‌లకు అనుగుణంగా తాజా టారిఫ్ పెంపుదలకు తీసుకువచ్చింది జియో. రిలయన్స్ జియో మొబైల్ టారిఫ్‌లను 12-27 శాతం మధ్య పెంచుతుందని ప్రకటించింది.